»   » విలన్‌గా రాణించాలనే...: మోహన్ బాబు, టిఎస్సార్‌తో కుంభాభిషేకం (పిక్చర్స్)

విలన్‌గా రాణించాలనే...: మోహన్ బాబు, టిఎస్సార్‌తో కుంభాభిషేకం (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాఖపట్నం: సినిమాల్లో విలన్‌గా రాణించాలనే కోరికతోనే తన ఊరి నుంచి హైదరాబాదు నగరానికి వెళ్లినట్లు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. తనది మధ్యతరగతి కుటుంబమని, పుట్టుకతోనే తను ఆస్తిపరుడిని కానని ఆయన అన్నారు. భగవంతుడి దయతో సినీ రంగంలో విభిన్నమైన పాత్రలు పోషించి హీరోగా, నిర్మాతంగా ఎదిగానని ఆయన చెప్పారు.

కాంగ్రెసు నాయకుడు టి. సుబ్బిరామిరెడ్డి తలపెట్టిన శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు. నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి జీరో అయ్యానని, భగవంతుడి దయతో అల్లుడుగారు సూపర్ డూపర్ హిట్ అయి తనను హీరోగా, నిర్మాతగా నిలబెట్టిందని ఆయన చెప్పారు. విలన్ కావాలని కోరుకున్నా హీరోగా కూడా ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టమని ఆయన అన్నారు.

హుధుద్ తుఫాను తనన కలచి వేసిందని, విశాఖ ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సాయంగా రూ.30 లక్షలు తన కుమారుడు మనోజ్ కుమార్‌తో పంపించానని ఆయన అన్నారు. మనోజ్, తన అభిమానులు ఆ డబ్బులతో బాధితులకు అవసరమైన సాయం అందించారని ఆయన చెప్పారు. తన విద్యా సంస్థల సిబ్బంది అందించిన ఒక నెల జీతాన్ని త్వరలో సిఎం సహాయ నిధికి అందిస్తానని ఆయన చెప్పారు. త్వరలోనే తన ఇంజనీరింగ్ సంస్థ విద్యార్థులతో విశాఖలో అవసరమైన చోట మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతానని ఆయన చెప్పారు.

కోటిలింగాలకు ప్రత్యేక పూజలు

కోటిలింగాలకు ప్రత్యేక పూజలు

మహా శివరాత్రి సందర్భంగా టిఎస్ఆర్ సేవాపీఠం అధ్వర్యంలో ఆర్కె బీచ్‌లో మంగళవారంనాడు ఏర్పాటు చేసిన కోటిలింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

మోహన్ బాబు కూడా..

మోహన్ బాబు కూడా..

కోటిలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్యక్రమంలో టి. సుబ్బిరామిరెడ్డితో పాటు దర్శకుడు రాఘవేంద్ర రావు, నడుడు మోహన్ బాబు కూడా పాల్గొన్నారు.

కుంభాభిషేకం

కుంభాభిషేకం

టి. సుబ్బిరామిరెడ్డి, మోహన్ బాబు, రాఘవేంద్ర రావు, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సామూహికంగా పవిత్ర జలాలు, పండ్ల రసాలతో కుంభాభిషేకం నిర్వహించారు.

ప్రజా సంక్షేమానికి యాగం

ప్రజా సంక్షేమానికి యాగం

కుంభాభిషేకం నిర్వహించిన తర్వాత వారంతా కలవిసి ప్రజా సంక్షేమం కోసం యాగం నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వాటిని నిర్వహించారు.

శివభక్తుడు టిఎస్సార్

శివభక్తుడు టిఎస్సార్

పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి శివభక్తుడు. ఆయన శివపూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఆయన సేవా పీఠం అధ్వర్యంలో మంగళవారంనాడు కుంభాభేషకం చేశారు

మోహన్ బాబు కూడా..

మోహన్ బాబు కూడా..

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు టి. సుబ్బిరామిరెడ్డితో కలిసి విశాఖలోని ఆర్కె బీచ్‌లో నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Telugu film actor Mohan Babu along with T subbirami Reddy, Raghavendra rao and swarroopanandedra Swami performed KumbhaBhisekham at Visakha
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu