»   » మేం బ్లూ ఫిలిమ్స్ తీయట్లేదు: మోహన్ బాబు

మేం బ్లూ ఫిలిమ్స్ తీయట్లేదు: మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: కేంద్ర మంత్రులు దద్దులా అనిపిస్తోంది. దద్దుల్లాంటి మంత్రులను పెట్టినప్పుడు అవినీతిపరురాలిని ఏం చేయాలి? దద్దు కేంద్ర మంత్రులు అవినీతిపరురాలిని ఎందుకు పెట్టారు? తెలుగు సినిమాను మేం పవిత్రంగా తీస్తున్నాం. బ్లూ ఫిలిమ్స్ తీయట్లేదు. దీనిపై చాంబర్, నిర్మాతల మండలి కలిసి పూనుకోవాలి. వాళ్లు చేతులెత్తేస్తే దాసరి నారాయణరావు చర్యలు తీసుకోవాలి. వర్మ ఆయనను కలవాలి. సెన్సార్ అధికారి ఇలా ప్రవర్తించడాన్ని ఇన్సల్ట్‌గా ఫీలవ్వాలి. ధనలక్ష్మి మీద ఉన్న కేసులను మీడియా ద్వారా ప్రజలకు చూపించండి అంటూ ఆవేదనగా ప్రశ్నించారు మోహన్ బాబు.

  రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం నాకు ఇష్టం. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం ఉందా? మంత్రులున్నారా? అనే ప్రశ్న, ఆవేదన కలుగుతున్నా యి. వర్మ హిందీలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి ఇక్కడికొచ్చి బాధపడుతున్నారంటే సెన్సార్ అధికారి గురించి అర్థం చేసుకోవాలి. ధనలక్ష్మిపై ఎన్ని కేసులున్నాయి? ఆమె భర్తపై ఎన్ని కేసులున్నాయి? ఆమెకు సంబంధించిన ఫైలు ఎక్కడుంది? ఆమె అనర్హురాలంటూ ఇప్పటికే ఓ న్యాయవాది కేసు కూడా వేశాడు. నేను కూడా ఆమెపై హైకోర్టుకు వెళ్లి సమన్లు పంపాను. సెన్సార్ ఆఫీసును తన సొంతంలా భావిస్తూ ఇష్టం వచ్చిన టైమ్‌కి వస్తోంది అంటూ మోహన్ బాబు ఆవేశంగా అన్నారు.

  ఇక "మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ నియంతృత్వం లేదు. ఆమె తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఏమైనా చేయవచ్చని అనుకుంటోంది. నా సినిమా విడుదల విషయంలో నాకు టైమ్ లేదు. కాబట్టి నిర్మాత మాట వినాల్సి వచ్చింది. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ప్రభుత్వ సంతకం లేకపోతే ఏం చేస్తాం. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాళ్లతో ఎవరైనా ఆడుకోవచ్చేమో అనిపిస్తోంది. నేను నిస్సహాయుడిననే ఆమె ఆడుకుంటోంది. బెగ్.. బారో.. స్టీల్ అనేది ధనలక్ష్మి విషయంలో పరాకాష్ఠకు వెళ్లిపోయింది. ఎవరో కాళ్లు పట్టుకుంటామని అన్నారట. మరొకరు పెట్రోలు పోసుకుంటున్నామన్నారట. అసలు విషయం ఏమిటంటే.. రామూగాడి లాంటి వాడి నుంచి దేశాన్ని కాపాడాలని ధనలక్ష్మి కంకణం కట్టుకుని కూర్చుంది'' అని విరుచుకుపడ్డారు. రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నానని, ఏ అధికారీ ఇలా చేయడం చూడలేదని చెప్పారు. ఆమె ముందు తాము రోడ్డు మీద బికారులమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అందరినీ కలుపుకొని వెళతామని, దాసరిని కూడా కలుస్తామని వర్మ చెప్పారు.

  వీరితో పాటు..కిరణ్‌కుమార్ రెడ్డి (నా సామిరంగ) మాట్లాడుతూ...నిర్మాతగా సెన్సార్ సభ్యుల స్నాక్స్ కోసం 1200 ఖర్చు పెట్టాలి. మనం నిలబడితే కూర్చోమని కూడా అనరు. ఎక్కువ మంది ఆవిడతో ఇబ్బందిపడ్డామంటున్నారు. ఇంత ఖర్చుపెట్టి చాంబర్ ఎందుకు? చేతులు కట్టుకు నిల్చుని, అమ్మా అమ్మా అని బతిమలాడటం, కాళ్లు పట్టుకుని నిలబడటం బాధాకరం. ఘోరం. ఓ స్ట్రాంగ్ పర్సన్ వస్తే అండగా ఉండటానికి రెడీ అన్నారు.

  బూరుగుపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ...సెన్సార్ ఆఫీసర్‌పై అనధికారికంగా మాకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వర్మ ఫిర్యాదు చేయలేదు. సెన్సార్ బోర్డుపై నిర్మాతలు అసంతృప్తిగా ఉంటారు. ట్రైలర్ సెన్సార్‌కు రెండో అధికారి కావాలని మంత్రిని అడిగాం. చేస్తానని కూడా చేయలేదు. ఇంతమంది ఫిర్యాదు చేస్తున్నారంటే ధనలక్ష్మితోనే ఏదో సమస్య ఉంది. నిర్మాతల మండలి తరఫున కలుస్తాం అన్నారు.

  English summary
  This is not the first time for the officer Dhana Laxmi to be accused of misusage of her power and harassing the producers. Names as big as Nagarjuna, Mohan Babu etc were treated with disdain and its now RGV's turn to get the stick.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more