twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు.. వైవీఎస్ చౌదరీపై మోహ‌న్ బాబు ఫైర్

    |

    ప్ర‌ముఖ‌ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు ఏడాదిపాటు జైలుశిక్ష అంటూ టెలివిజన్ ఛానెళ్లలో వచ్చిన వార్తలు సంచలనం రేపాయి. హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్ష‌ను ఖ‌రారు చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మోహన్‌బాబు స్పందించారు. తాను అరెస్ట్ కాలేదని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇంకా తన అరెస్ట్ వార్తకు సంబంధించిన అంశాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

    సలీం సినిమా వివాదంపై మోహన్‌బాబు

    సలీం సినిమా వివాదంపై మోహన్‌బాబు

    తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై మోహన్ బాబు మీడియాకు వివరణ ఇచ్చారు. ‘2009లో ‘స‌లీమ్' సినిమా చేస్తున్న స‌మయంలో ఆ చిత్రానికి సంబంధించిన పారితోషికాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం. మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికిగానూ ఆయ‌న‌కు రూ.40ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం అని మోహన్ బాబు వెల్లడించారు.

    కావాలనే బ్యాంకులో చెక్కు డిపాజిట్

    కావాలనే బ్యాంకులో చెక్కు డిపాజిట్

    అయితే స‌లీమ్ మూవీ ఊహించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో వైవీఎస్ చౌద‌రితో త‌దుప‌రి చేయాల్సిన సినిమాను వ‌ద్ద‌నుకున్నాం. సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పాం. అయినా కూడా కావాల‌నే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు అని మోహన్ బాబు ఆరోపించారు.

    కోర్టును తప్పుదోవ పట్టించారని

    కోర్టును తప్పుదోవ పట్టించారని

    సినిమా చేయడం లేదని చెప్పినా చెక్ డిపాజిట్ చేశాడు. ఆపై నా మీద చెక్ బౌన్స్‌ కేసు వేశారు. ఈ వ్యవహారంలో కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని ఛానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దు అని మోహన్‌బాబు అన్నారు.

    టెలివిజన్ వార్తలపై మోహన్‌బాబు రియాక్షన్

    టెలివిజన్ వార్తలపై మోహన్‌బాబు రియాక్షన్

    మాజీ ఎంపీ మోహన్‌బాబు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడం సంచలనం రేపింది. కోర్టు తీర్పు వెల్లడించగానే పలు టెలివిజన్ ఛానెళ్లు బ్రేకింగ్‌లతో అదరగొట్టారు. తాను అరెస్ట్ కాలేదంటూ టెలివిజన్ కథనాలపై మండిపడ్డారు. దాంతో మోహన్‌బాబు స్పందించాల్సి వచ్చింది.

    English summary
    Actor and Politician Mohan Babu given clarity on Cheque Bounce case filed by director YVS Chowdary. Mohan babu alleges that YVS intentionally deposited cheque in bank, after their movie stalled.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X