»   » ప్రభాస్ బావ... నా కోరిక తీరుస్తావా? మోహన్ బాబు ట్వీట్లు

ప్రభాస్ బావ... నా కోరిక తీరుస్తావా? మోహన్ బాబు ట్వీట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలగు సినిమా పరిశ్రమ మాత్రమే కాదు... ఇండియన్ సినిమా గర్వపడే సినిమా తీసారు రాజమౌళి. తాజాగా 'బాహుబలి-2' విడుదలైన తర్వాత బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షంతో పాటు రాజమౌళిపై, చిత్ర యూనిట్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసిన బాహుబలి-2 రూ. 1000 కోట్ల మార్కును అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రికార్డులు, అద్భుతాలు ఈ సినిమా క్రియేట్ చేస్తోంది.


బాహుబలి-2 సినిమా చూసిన మోహన్ బాబు సినిమా నిర్మాతలను, దర్శకుడిని, ప్రభాస్, రానా, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ లను ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేసారు.


నాతోపాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది

నాతోపాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది

డియర్ శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని. నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకోర్చి మీరు బాహుబలి ద్వారా ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్నందుకు నాతోపాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది అని మోహన్ బాబు ట్వీట్ చేసారు.


రానా గురించి

రానా గురించి

ప్రియమైన రాణా.. బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు.. దిగ్విజయోస్తు....అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు మోహన్ బాబు.MM క్రీమ్ గా.. కీరవాణిగా

MM క్రీమ్ గా.. కీరవాణిగా

కీర్.. మరకతమణిగా.. MM క్రీమ్ గా.. కీరవాణిగా.. ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడవై పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు ట్వీట్ చేసారు.


మా బావ ప్రభాస్

మా బావ ప్రభాస్

బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే 'రాజులు' పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను అని మోహన్ బాబు ట్వీట్ చేసారు.


కోరిక తీరుస్తావా బావా

కోరిక తీరుస్తావా బావా

ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేసారు.


రాజమౌళి గురించి

రాజమౌళి గురించి

ప్రియమైన @ssrajamouli.. భారతదేశంలో తెలుగు ప్రజలున్నారని అన్నయ్య NT రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప తెలుగు దర్శకుడున్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావ్. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని అర్ధాంగి 'రమ' ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను.. అని మోహన్ బాబు ట్వీట్ చేసారు.


విశ్వ విజయేంద్ర ప్రసాద్

విశ్వ విజయేంద్ర ప్రసాద్

ప్రియమైన ప్రసాద్.. బాహుబలి విజయంతో 'విశ్వ విజయేంద్ర ప్రసాద్' గా సార్థక నామధేయుడివి అయ్యావ్ ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను అంటూ మోహన్ బాబు ట్వీట్ చేసారు.English summary
Tollywood actor Mohan Babu appreciats Team of Baahubali via twitter. ' Baahubali 2: The Conclusion ' has raised the bar of the cinematic approach of Indian film industry. The S.S. Rajamouli flick has shattered major box office records including the ones overseas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu