»   » క్లారిఫికేషన్ వచ్చేసింది, మంచు లక్ష్మి ట్వీట్: ఆ లెజెండ్ పాత్రలో మోహన్ బాబు పక్కా

క్లారిఫికేషన్ వచ్చేసింది, మంచు లక్ష్మి ట్వీట్: ఆ లెజెండ్ పాత్రలో మోహన్ బాబు పక్కా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mohan Babu As SV Ranga Rao In Mahanati! మంచు లక్ష్మి ట్వీట్.. క్లారిటీ వచ్చేసింది..

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, ప్రకాష్ రాజ్, షాలిని పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నటుడు మోహన్ బాబు

నటుడు మోహన్ బాబు

సావిత్రి నిజజీవితంలో కీలక పాత్రలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను యంగ్ హీరోలతో చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక అలనాటి మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు అలరించనున్నారు. ఎస్వీ రంగారావు పేరు తలుచుకోగానే గంభీరమైన ఆయన రూపం, అనర్గళమైన ఆయన సంభాషణలు గుర్తుకొస్తాయి.

ఎస్వీ రంగారావుగా

ఎస్వీ రంగారావుగా

ఎన్ని తరాలు గడిచినా అలాంటి నటుడు మళ్లీరాకపోవచ్చని అంటారు. ఆ మహానటుడు లేకపోయినా మహానటి సినిమాలో మోహ‌న్ బాబుని ఎస్వీ రంగారావుగా మనముందుకు తీసుకురాబోతున్నారు. మ‌రి ఈ పాత్రకి మోహ‌న్ బాబు ఓకే అన్నాడా లేదా అనే దానిపై క్లారిటీ కొసమే ఎదురు చూసారు అంతా.. చాలా రోజులుగా ఈ వార్త వినిపిస్తున్నా.. ఇంత వరకు అధికారిక సమాచారం లేదు.

మంచు లక్ష్మీ కన్ఫామ్ చేసింది

మంచు లక్ష్మీ కన్ఫామ్ చేసింది

అయితే తాజాగా మంచు లక్ష్మీ ఓ పత్రికలో వచ్చిన వార్తను రీట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.ఇక ఎస్వీ రంగారావు .. సావిత్రి మధ్య ఎంతో అనుబంధం వుంది. ఎస్వీఆర్ ను సావిత్రి "నాన్నా" అని పిలిచేదట. ఆయన ఓ కూతురులా ఆమెను చూసుకునేవారని అంటారు.

సరైన క్లారిటీ లేకపోవటంతో

సరైన క్లారిటీ లేకపోవటంతో

అలాంటి ఎస్వీఆర్ పాత్ర కూడా ఈ సినిమాలో కీలకమే. అలాంటి పాత్రకోసం అందరినీ అనుకొని చివరికి మోహన్ బాబు దగ్గర ఆగింది నాగ్ అశ్విన్ అన్వేషణ. అయితే ఇన్నాళ్ళూ సమాచారం ఉన్నా సరైన క్లారిటీ లేకపోవటంతో ఎవ్వరూ ఈ విషయం మాట్లాడలేదు ఇప్పుడు మంచు లక్ష్మి ప్రకటనతో ఈ విషయాన్ని పక్కా చేసుకోవచ్చు.

గండిపేట ప‌రిస‌ర ప్రాంతాల‌లో

గండిపేట ప‌రిస‌ర ప్రాంతాల‌లో

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. గండిపేట ప‌రిస‌ర ప్రాంతాల‌లో సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. సావిత్రికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కీర్తి సురేశ్ పై చిత్రీకరిస్తున్నారు. సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. అలాగే ఎన్టీ రామారావు, అక్కినేని పాత్రలకోసం జూనియర్ ఎన్టీఆర్ ను, నాగచైతన్య ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

English summary
Finally, most versatile actor Manchu Mohan Babu is officially announced of playing legendary SV Ranga Rao in upcoming Savithri biopic under the title of Mahanati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu