కొడుకు హీరో...తండ్రి విలన్...

తాజాగా ఆయన మహేష్ బాబు సినిమాకీ విలన్ గా కమిటయ్యారు. అలాగే ఆయన కుమారుడు విష్ణువర్ధన్ హీరోగా వై.వి.యస్.చిత్రం 'సలీం...దుమ్ము రేపుతాడు' లోనూ ఆయన విలన్ గా కనపడతారని తెలుస్తోంది. ఆగష్టు లో ప్రారంభమయ్యే ఈ సినిమాలో ఆయన పూర్తిస్ధాయి నెగిటివ్ గా షేడ్స్ తో ఢిఫెరెంట్ గా చూపించబోతున్నారని అంటున్నారు. గతంలోనూ విష్ణుతో ఆయన 'గేమ్' అనే చిత్రం చేసారు. కాని ఆ చిత్రం డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. కానీ ...స్క్రిప్టు బలంతో వై.వి.యస్ కసితో చేస్తున్న చిత్రం కాబట్టి పాజిటివ్ ఫలితాన్ని ఎక్సపెక్ట్ చేయవచ్చు. ఈ సినిమా కోసం విష్ణు బరువు తగ్గి సగం అయ్యాడు.


Click it and Unblock the Notifications











