»   » నికృష్ణ రాజకీయాలను అసెంబ్లీ రౌడీలోనే చూపించా: మోహన్ బాబు

నికృష్ణ రాజకీయాలను అసెంబ్లీ రౌడీలోనే చూపించా: మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇంకో పార్టీలోకి వెళ్లిపోవడం వంటి నీచ నికృష్టమైన విషయాలను అప్పట్లోనే 'అసెంబ్లీ రౌడీ'లో చూపించామని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం విడుదలై శనివారంతో పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం దర్శకుడు బి. గోపాల్‌, రచయిత పరుచూరి గోపాలకృష్ణతో కలిసి మోహన్ బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఇది తమిళంలో పి. వాసు డైరెక్ట్‌ చేయగా హిట్టయిన 'వేలై కిడైచుడుచ్చు' సినిమాకి రీమేక్‌ అని అన్నారు. అప్పుడు గుర్రంలా పరుగులు పెడుతున్న బి. గోపాల్‌ను డైరెక్ట్‌ చెయ్యమంటే సరేనన్న్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌ రాసేశారని అన్నారు. హీరోయిన్‌గా దివ్యభారతిని ఎంపిక చేశామని, అద్భుతంగా చేసిందని అన్నారు.

Mohan Babu

తన తండ్రి పాత్రకు మొదట రావు గోపాలరావును అనుకున్నామని, ఆయన షూటింగ్‌కు ఏడింటికి కాకుండా తొమ్మిదిన్నరకు వస్తానంటే, సున్నితంగా వద్దని చెప్పి జగ్గయ్యగార్ని తీసుకున్నామని మోహన్ బాబు చెప్పారు. 'స్వర్గం నరకం'లో తన హీరోయిన్‌గా చేసిన అన్నపూర్ణ ఇందులో తన తల్లి పాత్రను చేశారని, కె.వి. మహదేవన్ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారని చెప్పారు.

'అసెంబ్లీ రౌడీ'ని 41 రోజుల్లో తీశామని, 25 వారాలు ఆడిందని, తిరుపతి దగ్గర తిరుచానూర్‌లో క్లైమాక్స్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ ఐదుగురు కాంగ్రెస్ వాళ్లు వచ్చి గొడవ చేసి, తమకు భద్రతగా ఉన్న ఓ కానిస్టేబుల్‌ను కొట్టబోతే, చేతిలో ఉన్న కత్తితో తరిమానని చెప్పారు.

వాళ్లను పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించామని చెప్పారు సినిమా రిలీజయ్యాక 'అసెంబ్లీ రౌడీ' అనే టైటిల్‌ పెట్టానని అసెంబ్లీలో మూడు రోజుల పాటు గొడవ జరిగిందని, సినిమాని నిషేధించాలన్నారని మోహన్ బాబు చెప్పారు. "నా కటౌట్లు ధ్వంసం చేశారు. స్పీకర్‌ ధర్మారావుగారు సినిమా చూసి అబ్జెక్ట్‌ చెయ్యాల్సింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు 'అసెంబ్లీ రౌడీ' రీమేక్‌ని చెయ్యాలని విష్ణు ఆశిస్తున్నాడు" అని చెప్పారు.

సెట్స్‌పై మోహన్‌బాబు నటిస్తుంటే, తాను డైరెక్టర్‌లా కాకుండా ఓ ప్రేక్షకుడిలా అలాగే చూస్తుండిపోయేవాణ్ణని బి గోపాల్ చెప్పారు. "మా జీవితంలో ఒక్క అక్షరం కూడా మార్చకుండా తీసిన ఏకైక సినిమా 'అసెంబ్లీ రౌడీ'. డైలాగ్‌ చెప్పగలిగినవాడికి, డైలాగ్‌ రాయగలిగినవాడు దొరికితే, దాన్ని దమ్మెంతుంటుందో చూపించిన మొదటి సినిమా 'అసెంబ్లీ రౌడీ'. అలా డైలాగ్స్‌తో ఆడుకున్నాడు మోహన్‌బాబు" పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

English summary
Speaking on Assembly Rowdy film collection King Mohan Babu made comments against deffections MLAs from one party to another party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X