»   » 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మోహన్ బాబు

35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కరెక్టుగా ముప్పై ఐదు సంవత్సరాలు క్రిందట(1975 నవంబర్ 22న) మోహన్ బాబు జన్మించారు. ఇవాళ ఆయన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. అదేంటి మోహన్ బాబుకి ముప్పై ఐదేళ్ళేనా అని ఆశ్చర్యపోకండి. భక్త వత్సల నాయుడుగా ఆయన ఎప్పుడో పుట్టి ఉండి ఉండవచ్చు. కానీ నటుడు మోహన్ బాబు గా జన్మించిన తేది మాత్రం ఈరోజే...అంటే 'స్వర్గం నరకం' (దాసరి నారాయణరావు దర్శకత్వం) చిత్రం విడుదలైన రోజు...ప్రపంచానికి మోహన్ బాబు పరిచయం అయన రోజు...ఈ రోజు. దాసరి దగ్గర అసెస్టెంట్ డైరక్టర్ గా చేరిన భక్తవత్సలం నాయుడు ఆ తర్వాత విలన్ గా 'శివరంజని', 'పదహారేళ్ల వయసు', 'సర్దార్ పాపారాయుడు', 'దేవత' వంటి చిత్రాలతో స్దిరపడ్డారు. విలన్ గా మంచి ఊపుమీద ఉన్నప్పుడు 'కేటుగాడు' తో సోలో హీరోగా మారి...'అల్లుడుగారు', 'అసెంబ్లీ రౌడి', 'అల్లరి మొగుడు', 'రౌడీగారి పెళ్లాం', 'బ్రహ్మ' వంటి చిత్రాలతో వరస హిట్స్ ఇచ్చారు.

ఆ తర్వాత వచ్చిన మెగా హిట్ 'పెదరాయుడు' (1995) ని చూడని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో కలిసి 'మేజర్ చంద్రకాంత్', తర్వాత తరం మార్చి ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ తో యమదొంగ చేసినా వీసమెత్తుకూడా తగ్గని నటనా చాతుర్యం తగ్గలేదు. 35 సినీ ప్రయాణంలో 510 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఆయన శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ని పెట్టి రీసెంట్ గా 'ఝుమ్మంది నాందం' చిత్రం వరకు పలు చిత్రాలు నిర్మించి నిర్మాతగానూ శభాష్ అనిపించుకున్నారు. భారతీయ సినిమాకి ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో 'పద్మశ్రీ' బిరుదుతో ఈ అసమాన నటుడుని సత్కరించింది. తండ్రి బాటలోనే ఆయన తనయులు విష్ణు, మనోజ్ హీరోలుగా ప్రయాణం ప్రారంభించారు. అలాగే కుమార్తె లక్ష్మీప్రసన్నకూడా నటిగా, నిర్మాతగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది.

నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా, తండ్రిగా అన్ని విధాలా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్న మోహన్ బాబు..నేటికీ మంచి పాత్ర అనేది వస్తే రెడీ అంటూ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఈ నట ప్రపూర్ణుడు మరిన్ని ఇలాంటి నటనా పుట్టిన రోజులు జరుపుకోవాలని ధట్స్ తెలుగు మనస్పూర్తిగా ఆశిస్తోంది...పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu