»   » కృష్ణంరాజు మోహన్ బాబుల మధ్య చిచ్చుపెట్టిన సినిమా: మళ్ళీ తెరపైకి తెస్తున్నారా??

కృష్ణంరాజు మోహన్ బాబుల మధ్య చిచ్చుపెట్టిన సినిమా: మళ్ళీ తెరపైకి తెస్తున్నారా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోహన్ బాబు ఇంకో సంచలనానికి తెర తీయ బోతున్నాడా..?? ఇప్పటి దాకా డైలాగ్ లతోనే అదరగొట్టిన ఆయన ఇప్పుడు మెగా ఫోన్ పట్ట బోతున్నాడా? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే.. మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా క‌న్న‌ప్ప క‌థ‌ అనే చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ విష‌య‌మై 2015 లోనే 24 ఫ్రేమ్స్ ఫాక్ట‌రీ ఓ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసింది. త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు అంటూ వార్తలు వచ్చాయి.

ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టాం

ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టాం

‘‘దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్టయ్యేలా భరణిగారు స్క్రిప్టు రచించారు. ఆ స్క్రిప్టును ఓకే చేసినప్పట్నించీ ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అనే ఉద్వేగంతో ఉన్నాం. ఓ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థతో కలిసి దీన్ని నిర్మించబోతున్నాం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టాం.

మళ్ళీ తేరమీదకి వచ్చింది

మళ్ళీ తేరమీదకి వచ్చింది

ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం'' అని విష్ణు దాన్నిధృవీకరించాడు కూడా. అయితే ఏవో కారణాల వల్ల అప్పుడు కుదరలేదు. అయితే ఈ సినిమా మళ్ళీ తేరమీదకి వచ్చింది అదీ ఒక సంచలన న్యూస్ తో అదేమిటంటే...

అంతర్జాతీయ ప్రమా ణాలతో

అంతర్జాతీయ ప్రమా ణాలతో

ఈ సినిమాకి డైలాగ్ కింగ్ మోహన్ బాబు దర్శకత్వం వహించనున్నాడట. ‘కన్నప్ప' అనే స్క్రిప్ట్‌ విష్ణు దగ్గర సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలని ఆశ. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ద్వారానే మోహన్‌ బాబు దర్శకత్వం వైపు అడుగు వేస్తారని ఇటీవల ఓ వార్త గుప్పుమంది.

2018 ప్రధమార్థంలో

2018 ప్రధమార్థంలో

ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేస్తున్నార్ట. 2018 ప్రధమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. ‘కన్నప్ప'లో శివుడిగానూ కనిపించబోతున్నారు మోహన్‌బాబు. ఈ చిత్రాన్ని దాదాపుగా అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయి.

ప్ర‌భాస్‌తో

ప్ర‌భాస్‌తో

ఇదిలా ఉంటే ఈ సినిమా వల్లే సీనియర్ నటుడు కృష్ణం రాజుకీ మొహన్ బాబుకీ మాటా మాట వచ్చిందనే టాక్ కూడా ఉంది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ప్ర‌భాస్‌తో ఎప్ప‌టి నుంచో భ‌క్త‌క‌న్న‌ప్ప‌ సినిమా తీయాల‌ని అనుకొంటున్నాడు. త‌న డ్రీమ్ ప్రాజెక్టు అదే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ ప్ర‌య‌త్నం కార్య‌రూపం దాల్చ‌లేదు. ప్ర‌భాస్ కూడా చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే ఈ లోగా మంచు ఫ్యామిలీ ఆ స్క్రిప్ట్తో సినిమా చేసేస్తోంది.

కృష్ణంరాజు

కృష్ణంరాజు

క‌న్న‌ప్ప క‌థ‌పై నాకు మ‌క్కువ ఉంది. ఆ సంగ‌తి మీకు తెలుసు. అందుకే మీరు డ్రాప్ అయిపోండ‌ని కృష్ణంరాజు మోహ‌న్‌బాబుని అడిగాడ‌ట‌. అయితే ఇందుకు మోహ‌న్‌బాబు ఈ సినిమా స్టోరీతో తాము సినిమా చేస్తున్నందున కావాలంటే మీరు కూడా తీసుకోండ‌ని..అంతేకాని త‌మ సినిమా ఆప‌మ‌ని చెప్పాడ‌ట‌. దీంతో మోహ‌న్‌బాబు స‌మాధానానికి కృష్ణంరాజు కాస్త నొచ్చుకున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

English summary
If the buzz is true, then Mohan Babu will direct Kannappa, which has his son Manchu Vishnu playing the lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu