»   » ప్రియాంకను బంగారు గాజులతో సన్మానించిన మోహన్ బాబు

ప్రియాంకను బంగారు గాజులతో సన్మానించిన మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా , కాంగ్రెస్ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి ప్రియాంకను ఢిల్లీలోని తాజ్‌మహల్ హోటల్‌లో సత్కరించారు. ఈ కార్యక్రమంకు మోహన్‌బాబు, ఆయన తనయ మంచు లక్ష్మీ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంలో సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి , నటుడు మోహన్ బాబు .. ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సన్మానించారు. మోహన్ బాబు తనపై చూపించిన ఆత్మీయ ఆదరణకు పులకించిన ప్రియాంక ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా, బ్రిటీష్ హై కమీషనర్ సర్ డోమ్నిక్, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరైనట్టు సమాచారం. ప్రియాంక బేవాచ్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Mohan Babu felicitates Padma Shri Priyanka Chopra

'సాత్ ఖూమ్ మాఫ్' చిత్రంలో ప్రియాంక కనబరచిన అద్భుత నటనకుగాను 2011లో ఈమెకు మొదటి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రియాంక 'బాజిరావ్ మస్తాని'లో కాశీ భాయ్‌గా నటించి మెప్పించిన ఆమెకు ఈ ఏడాది ఉత్తమ నటి కేటగిరిలో దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కింది.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ప్రియాంక పద్మ పురస్కారం స్వీకరించిన నేపథ్యంలో సుబ్బ‌రామి రెడ్డి ఢిల్లీలో విందు ఏర్పాటు చేసి ఈ గాజులు బ‌హుమ‌తిగా ఇచ్చి ఘ‌నంగా స‌త్క‌రించారు. సుబ్బిరామిరెడ్డికి కళాకారులంటే చాలా మక్కువ. అందుకే వారికి తరచూ అవార్డులు, సన్మానాలు, సత్కారాలు చేస్తుంటారు.

English summary
Bollywood star Priyanka Chopra, who was honoured with the Padma Shri on Tuesday morning by President Prabab Mukherjee, was felicitated by Rajya Sabha MP T. Subbarami Reddy at a private function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu