»   » ట్రెండ్ ఫాలోయింగ్: మోహ‌న్‌బాబు కూడా మొదలెట్టారు

ట్రెండ్ ఫాలోయింగ్: మోహ‌న్‌బాబు కూడా మొదలెట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్య తమ సినిమాల విడుదల సందర్భంగా సినీ స్టార్లు సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమానులతో ముచ్చటించడం, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. ఇపుడు అంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది. మోహ‌న్‌బాబు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. డిసెంబ‌ర్ 24వ తేదిన సోష‌ల్ మీడియా క్వ‌శ్చ‌న్స్ అండ్ ఆన్స‌ర్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఉద‌యం ప‌ది గంట‌ల నుండి ఓ గంట‌పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

ప్రేక్ష‌కులు, అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మోహ‌న్‌బాబు స‌మాధానం చెబుతారు. మోహ‌న్‌బాబు, ర‌మ్య‌కృష్ణ‌, మీనా, అల్ల‌రి న‌రేష్‌, పూర్ణ హీరో హీరోయిన్లుగా న‌టించిన మామ మంచు అల్లుడు కంచు సినిమా డిసెంబ‌ర్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస‌రెడ్డి తీర్చిదిద్దారు. అవుటండ్ అవుట్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కులను న‌వ్వుల్లో ముంచెత్తడానికి రెడీ అయింది.


Mohan Babu gets trendy!!

ఈ చిత్రంలో మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా,సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న,దాసన్న, అంబటి శీను ఇతర తారాగణంగా నటించారు.


ఈ చిత్రానికి మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్,విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

English summary
Now Dr. Mohan Babu joins the Social Media Bandwagon! He has agreed to be a part of a live Q & A session with the man, Dr. Mohan Babu himself, on the 24th of December on Twitter and Facebook! The session would start at 10:00 a.m, and it would be an hour long session. You could ask him all the questions that you wanted, and get candid with the legendary actor! Dr.Mohan Babu has always known to speak his mind and it would interesting to read his answers to the cheeky questions in social media.
Please Wait while comments are loading...