»   » మోహన్ బాబు కు నరేంద్ర మోడీ ఉత్తరం..ఫుల్ హ్యాపీ

మోహన్ బాబు కు నరేంద్ర మోడీ ఉత్తరం..ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మోహన్ బాబు తన కుమారుడు మంచు మనోజ్ వివాహం కోసం..కొద్ది రోజుల క్రితం వ్యక్తిగతంగా నరేంద్రమోది ని కలిసి శుభలేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బిజీ షెడ్యూల్ లో రాలేకపోయారు. అయితే విషయం మర్చిపోకుండా...నూతన వధూవరులకు ఆయన శుభాకాంక్షలు తెలియచేస్తూ...ఉత్తరం రాసారు. ఈ విషయాన్ని మోహన్ బాబు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియచేసారు.

మోహన్ బాబు ట్వీట్ చేస్తూ... ప్రధానమంత్రి నరేంద్రమోది నుంచి ఉత్తరం అందుకున్నాను. నూతన వధూవరులను ఆశ్వీరదిస్తూ రాసిన అందమైన ఉత్తరం అది. అంత బిజీ షెడ్యూల్ ల్ లోకూడా ఆయన ఈ విషయం గుర్తు పెట్టుకుని స్పందించి శుభాకాంక్షలు తెలియచేటం చాలా ఆనందంగా ఉంది. యువకులు, ఔత్సాహిక రాజకీయనాయకులు ...నరేంద్రమోదీ గారి నుంచి చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగ ఆయన ఎలా లీడర్ అయ్యారు..స్నేహితుడుగా, ఓ సోదరుడు గా ఎలా ఉంటూ వస్తున్నారు అనేది అన్నారు. 


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బుధవారం హైదరాబాద్‌లో హైటెక్స్‌ ప్రాంగణంలో మంచు మనోజ్‌ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. సరిగ్గా ఉదయం 9గంటల 10 నిమిషాలకు మనోజ్‌ ప్రణతి మెడలో మూడుముళ్లు వేశాడు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మోహన్‌బాబు ప్రేమతో 'గురువుగారూ..' అని పిలుచుకొనే దాసరి నారాయణరావు సమక్షంలో మనోజ్‌ పెళ్లి జరిగింది.

Mohan babu happy with Narendra Modi letter

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వచ్చారు.

అలాగే రామోజీరావు, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్లు రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, జగదీష్‌రెడ్డి, సినీ ప్రముఖులు రజనీకాంత్‌, అంబరీష్‌, కె.రాఘవేంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, నందమూరి బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, సూర్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Mohan babu tweeted "Honored to have received a letter from our PM narendramodi. Beautiful letter blessing the newly weds.In such busy schedule he did remember! Youngsters and upcoming politicians should learn a lot from Shri narendramodi ji. Mainly on how to be a leader, friend and a brother."
Please Wait while comments are loading...