»   » పర్ఫెక్ట్ నిర్మాతలు ఎంతమంది...!?: కలెక్షన్ కింగ్..

పర్ఫెక్ట్ నిర్మాతలు ఎంతమంది...!?: కలెక్షన్ కింగ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల విడుదలైన 'ఝుమ్మందినాదం" మంచి చిత్రమని ఘనవిజయం సాధించడం ఖాయమని అందరూ ఆ చిత్రాన్ని మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మనోజ్ హీరోగా కాగా లక్ష్మీ ప్రసన్న నిర్మాత. ఇటీవల ఈ చిత్రంకు సంబంధించిన లక్ష పైరసీ సీడిలను పట్టుకున్నారు. పైరసీని అరికట్టడానికి నిర్మాతల మండలి సరిగ్గా పనిచేయడంలేదని, అసలు పెర్ఫెక్ట్ నిర్మాతలెంతమందున్నారని నిర్మాతల మండలి పై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ పైరసీ భూతాన్ని తరిమికొట్టాల్సిన నిర్మాతల మండలివారు వారి పని సరిగ్గా చేయడంలేదు. పెద్ద నిర్మాతలైనా చిన్న నిర్మాతలైనా వారి తీసిన సినిమాలు పైరసీకి గురవుతున్నాయి. నా బ్యానర్ లో వచ్చే సినిమాకి సంబంధించిన ప్రతి ప్రింట్ ను ఆయా ఏరియా వారితో సంతకం చేయించుకుని ఇస్తాను. గతంలో నా బ్యానర్ లో నిర్మితమైన 'కృష్ణార్జున" చిత్రంను ఒక జిల్లాలో ఒక థియేటర్ లో పైరసీ చేసారు. దానికి సంబంధించిన పైరసీ సీడిని పట్టుకుని ఆ ప్రింట్ నెంబర్ తో సహా గుర్తించి నిర్మాతల మండలికి కంప్లయింట్ చేసాం. కానీ దాని గురించి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు 'ఝుమ్మందినాదం" చిత్రం పైరసీకి గురవుతోంది. కానీ నిర్మాతల మండలి ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తోందని తన ఆవేదనను వ్యక్తపరిచారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu