»   » ఎన్టీఆర్ అడుగుజాడల్లో కలెక్షన్ కింగ్..విలనిజమే హీరోను చేస్తాయ్.!

ఎన్టీఆర్ అడుగుజాడల్లో కలెక్షన్ కింగ్..విలనిజమే హీరోను చేస్తాయ్.!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో నటుడు మోహన్ బాబుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేమిటంటే..టాలీవుడ్ లో సీనియర్ ఎర్టీఆర్ తర్వాత డైలాగ్ చెప్పటంలో మోహన్ బాబు తప్ప ఎవ్వరూ లేరని..!అందుకే డైలాగ్ కింగ్ అనే బిరుదును మోహన్ బాబు స్వంతం చేసుకున్నాడు. మరి మోహన్ బాబు పెద్ద ఎన్టీఆర్ ను ఏం ఫాలో అవుతున్నాడు? ఎన్టీఆర్ భారతదేశంలోనే ఒక మహానటుడిగా, హీరోగా ప్రఖ్యాతిగాంచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హీరో కన్నా, విలన్ పాత్రల మీద క్రేజ్ ఉండటంతో, పౌరాణికాలో విలన్ పాత్రలు వేసి, హీరోగా రాణించాడు.

ఎన్టీఆర్ రావణ పాత్ర వేస్తే, ఆపాత్ర రావణ బ్రహ్మగా పేరుగాంచింది. దుర్యోధన పాత్ర వేస్తే, సుయోధనుడుగా వేసి, హీరోను చేసింది. 'కర్ణ" పాత్ర వేస్తే, 'దానవీర శూర కర్ణ" గా మెప్పించి, కర్ణుడే హీరోగా ఆ పాత్రను మరల్చాడు. ఆఖరికి 'కన్యాశులకం"లో (విలన్)గిరీషం పాత్రలో ఎన్టీఆర్ కు ప్రేక్షకుల జేజేలు అందుకున్నాడు. మోహన్ బాబు కూడా మొదట విలన్ వేషాలు వేసి, హీరోగా సక్సెస్ అయ్యినవాడే. ఇప్పుడు మోహన్ బాబు రావణ పాత్ర వేసి ఎన్టీఆర్ బాటలో పయనించాలని పట్టుదలతో ఉన్నాడు. మోహన్ బాబు 'రావణ బ్రహ్మ"గా కె రాఘవేంద్రకు దర్శకుడిగా త్వరలోనే సెట్స్ కి వెళుతున్నట్లు టాలీవుడ్ టాక్.

English summary
Now, it is heard that Mohan Babu is gearing up to don the role of Ravana. Just like the NTR movies, this is slated to be a complete Ravana movie. This is likely to be directed by K Raghavendra Rao. For now, the proposal got okayed as per sources and a noted corporate company is producing it. The film is likely to hit the floors next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu