»   » ఐదుగురు భామలతో కలెక్షన్ కింగ్ రొమాన్స్..

ఐదుగురు భామలతో కలెక్షన్ కింగ్ రొమాన్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సునీల్ కాంబినేషన్లో రాయుడుగార్కికోపమొచ్చింది….అనే సినిమాని రూపొందించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే...విలక్షణ నటుడు మోహన్ బాబు మళ్లీ కథానాయకుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ చిత్రానికి ఇ నివాస్ దర్శకత్వం వహిస్తాడు. దీనికి కోన వెంకట్, గోపీమోహన్, బి.వి.యస్.రవి రచయితలుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి మోహన్ బాబు మాట్లాడుతూ, 'ముగ్గురు రచయితలు ఏడాది పాటు కష్టపడి దీనికి ఓ అద్భుతమైన కథ తయారుచేశారు. ఇది మా బ్యానర్లో మరో మంచి సినిమా అవుతుంది. ఐదుగురు హీరోయిన్లు వుంటారు. ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తాం" అన్నారు. ఈ రోజు తన మేరేజ్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని మోహన్ బాబు ప్రకటించారు.

English summary
Mohan Babu is all set to act with five glamorous heroines in his next film. The actor cum producer yesterday (July 29th) announced that he's producing a film in the direction of E Nivas and he will star in it as a solo hero. He also said in a statement that the movie would have actresses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu