twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏయన్నార్‌కు కి మోహన్‌బాబు ఆత్మీయ కానుక

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ మధ్యనే 90వ జన్మదినం జరుపుకున్న అక్కినేని నాగేశ్వరరావుకు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు, అతని తనయుడు మంచు విష్ణు కలిసి అక్కినేని నాగేశ్వరరావుకి భారీ చిత్రపటాన్ని బహూకరించారు. 18 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉన్న ఈ చిత్రపటంలో అక్కినేని సినిమా కెరీర్‌కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని, ఆయన సినిమాల పేపరు కటింగ్స్‌ని పొందుపరిచారు. ఈ కటింగ్స్‌ అన్నీ కలిసి మహావిష్ణువు, శ్రీరాముడు ఆకారంలో కనిపిస్తాయి. దీన్ని శ్రీకాళహస్తికి చెందిన రమేష్‌ గురజాల రూపొందించారు.

    అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ''నా సినిమాలన్నింటినీ ఒక వరుసలో చేర్చి.. ఇలా నాకివ్వడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని రూపొందించిన రమేష్‌ గురజాలకు నా అభినందనలు. ఈ చిత్రపటం గురించి మోహన్‌బాబు నాకు కొన్ని రోజుల క్రితం చెప్పాడు. నా సినిమాలన్నింటినీ ఒక వరుసలో చేర్చి మహావిష్ణువు, శ్రీరాముడు కనిపించేలా ఆకృతినివ్వడం చాలా సంతోషంగా ఉంది మోహన్‌బాబు, విష్ణులకు నా ఆశీపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అన్నారు.

    మంచు విష్ణు మాట్లాడుతూ ''చిత్రపరిశ్రమలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు. ఆయన జన్మదిన కానుకగా ఏదైనా విశిష్టమైన కానుక ఇవ్వాలనుకొని దీన్ని రూపొందించాము. ఆరు నెలల క్రితం ఈ చిత్రపటాన్ని ప్రారంభించాం. నాగేశ్వరరావుగారి సినిమాలకు సంబంధించిన విషయాల్లో సుమంత్ నాకు ఎంతో సహకరించాడు''న్నారు
    ''ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నాకు రెండు కళ్లు లాంటివారు. ఈ చిత్రపటం చూశాక నా కళ్లు చెమర్చాయి. వారిద్దరితో కలిసి చాలా చిత్రాల్లో నటించాను. '' అని మెహన్‌బాబు తెలిపారు. నటుడు సుమంత్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    English summary
    On the occasion of ANR’s 90th birthday, Dr. Mohan Babu presented a special poster to ANR. This giant poster, measuring 18 feet wide and 4 feet long, has been designed in Kalahasti by Ramesh Gurajala. The poster contains press clippings of ANR’s films and they have been arranged in such a way that when seen from a distance,they will appear to be in the shape of Lord Sri Ram and Lord Vishnu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X