»   » పెదరాయుడికి రెండు దశాబ్దాలు: ఇక మోహన్ బాబు కన్నప్ప కథ

పెదరాయుడికి రెండు దశాబ్దాలు: ఇక మోహన్ బాబు కన్నప్ప కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన నటించిన పెదరాయుడు చిత్రం రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు డా.మోహన్ బాబు నిర్మాతగా ‘కన్నప్ప కథ' చిత్రం రూపొందుతోంది. ఎనిమిది దశాబ్దాలను పూర్తి చేసుకున్న టాలీవుడ్ లో ఎన్నో మరపురాని చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి.

Mohan babu to produce Kannappa Katha

అటువంటి మేటి చిత్రాల్లో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నిర్మిస్తూ, నటించిన చిత్రం పెదరాయుడు ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఆప్త మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించడం విశేషం. కుటుంబంలో బంధాలు, అనుంబంధాలు గురించి గొప్పగా చాటి చెప్పిన ఈ చిత్రంలో పెదరాయుడుగా మోహన్ బాబు నటన అద్వితీయం. ఈ చిత్రం ఇరవై వసంతాలను పూర్తి చేసుకుంది.

Mohan babu to produce Kannappa Katha

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా దశ, దిశను మార్చిన చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలోని ప్రతి డైలాగ్ ఇప్పటికీ, ఎప్పటీకీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి నిలిచిపోయాయి. పెదరాయుడుగా తెలుగు ప్రజలను అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారతదేశంలోని అన్నీ భాషల్లో ‘కన్నప్ప కథ'చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mohan babu to produce Kannappa Katha

పరమశివుని మహాభక్తుడిగా పేరు పొందిన కన్నప్ప గురించి తెలియని తెలుగువాడుండడు. ఆయన భక్తికి తార్కాణమే శ్రీ కాళహస్తీశ్వరాలయం. శివుని పరమవీర భక్తునిగా పేరు పొందిన కన్నప్ప పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటించనున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ, హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని డా.మోహన్ బాబు తెలియజేశారు.

English summary
Dr Moahan Babu to produce Kannappa Katha film in which Manchu Vishnu to act as Kannappa, directed by Tanikella Bharani.
Please Wait while comments are loading...