»   » ప్రధాని మోదీని నిలదీసిన మోహన్‌బాబు..

ప్రధాని మోదీని నిలదీసిన మోహన్‌బాబు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టాలీవుడ్ ప్రముఖులు ట్వీట్ల అస్త్రాన్ని సంధిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ దారిలోనే డైలాగ్ కింగ్ మోహన్‌బాబు అసంతృప్తిని ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు. ప్ర‌త్యేక హోదా అంశంపై ప్ర‌ధాని మోదీని నిల‌దీయడం చర్చనీయాంశమైంది.

రాష్ట్ర విభజన తర్వాత దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ ఎందుకు? ఏపీ రాష్ట్రం చేసిన త‌ప్పేంటి? ప్ర‌త్యేక హోదాపై ఏమి జ‌రుగుతున్నది? ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌ని తెలంగాణ కూడా కోరుకుంటున్నది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ మాత్ర‌మే అనుకుంటున్నారా? అని మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

English summary
Special status subject is now hot topic in both Telugu states. Few of the Film stars are questioning the injustice happened to Andhra Pradesh. After Koratal Shiva criticism, Mohan Babu raised his voice in twitter. He asked Why Step Mother love on Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu