'అల్లుడు గారు', 'అల్లరి మొగుడు', 'సోగ్గాడి పెళ్ళాం' వంటి అనేక సినిమాల్లో హిట్ పెయిర్ గా అలరించిన మోహన్ బాబు...రమ్యకృష్ణ జంటగా మళ్ళీ కనువిందుచేయనున్నారు. దర్శకుడు కోదండరామ రెడ్డి కుమారుడు 'గొడవ' ఫేమ్ వైభవ్ చేస్తున్న సినిమాలో వీరు కనిపిస్తారు. ఇక ఈ సినిమా ద్వారా భాను అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బిందు (శేఖర్ కమ్ముల 'ఆవకాయ బిర్యాని' సినిమాలో అమ్మాయి) వైభవ్ కి జంటగా చేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరో మేనత్తగా ,ఆమె భర్తగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మోహన్ బాబు చేస్తున్నారు.