»   » తండ్రి సెక్సీ వేషాలు : జుట్టుపీక్కున్న విష్ణు(ఫన్నీ ఫోటో)

తండ్రి సెక్సీ వేషాలు : జుట్టుపీక్కున్న విష్ణు(ఫన్నీ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూసారా? హాట్ హీరోయిన్ రవీనా టండన్‌కు ఇలా ఫ్యాన్ పట్టి కూల్ చేస్తున్నాడు మోహన్ బాబు. ఈ సీన్ చూసి తట్టుకోలేని అతని కొడుకు విష్ణు..........నాన్నా ఏంటీ పని అంటూ జుట్టుపీక్కుంటున్నాడు. ఈ ఫన్నీ ఫోటో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ సెట్లో తీసిన ఫోటో ఇది.

ఈ ఫోటోను ఫోస్టు చేసింది మరెవరో కాదు...మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న. తమ సినిమాపైకి అందరి దృష్టి మళ్లించేందుకు, తమ సినిమా జనాల్లో చర్చనీయాంశం కావాలనే పబ్లిసిటీ ప్లాన్‌తో ఈ ఫోటో తీసినట్లు స్పష్టం అవుతోంది. వారు ఊహించినట్లుగానే ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌లు ప్రధాన పాత్రలు చేస్తుండగా, వరుణ్ సందేష్, తనీష్ కూడా నటిస్తున్నారు. రవీనాటాండన్‌, హన్సిక, ప్రణీత హీరోయిన్స్. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం. దాసరి- మోహన్‌బాబుల మధ్య గురుశిష్యుల సంబంధం ఉంది. ఆ అనుబంధంతోనే దాసరి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారని తెలిసింది.

టైటిల్ ఖరారు కాని ఈచిత్రం బాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసిన గోల్ మాల్ 3కి రీమేక్ అని సమాచారం. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మోహన్ బాబుకు జోడీగా బాలీవుడ్ నటి రవీనా టండన్ నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీమోహన్, కోన వెంకట్, బివిఎస్ రవి స్క్రిప్టు అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి, బప్పీ లహరి, ఆచ్చు, బాబా సెహగల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
A picture is worth thousand words and here is that moment caught on phone by Manchu beauty Lakshmi Prasanna. During the shoot of latest multi-starrer featuring Mohan Babu, Varun Sandesh, Vishnu, Manoj and Tanish, this naughty incident took place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu