»   » ఫ్యామెలీ కామెడీ(పాండవులు పాండవులు తుమ్మెద ప్రివ్యూ)

ఫ్యామెలీ కామెడీ(పాండవులు పాండవులు తుమ్మెద ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు కుటుంబ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ రోజు( 31న) ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. . మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందింది. అలాగే పాత్రల చిత్రణ హిందీలో వచ్చిన 'గోల్‌మాల్‌3'కి దగ్గరగా ఉన్నాయని కొందరు అంటున్నారు. కానీ రెండింటికీ సంబంధం లేదు అని మోహన్ బాబు అంటున్నారు. ఈ సినిమాని జింగ్‌రీల్ డాట్ కామ్ ద్వారా సోమవారం ఆన్‌లైన్‌లోనూ విడుదల చేస్తున్నారు.

చిత్రంలో మోహన్ బాబు పాత్ర పేరు నాయుడు. ఆ పాత్ర నోటికి దురుసు ఎక్కువ. చేతికి దురదెక్కువ. సినిమాలో విష్ణు రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తాడు. మనోజ్‌ స్త్రీ పాత్రలో కనిపిస్తాడు. బృహన్నలగా ఎన్టీఆర్‌గారికి ఎంత పేరు వచ్చిందో ఇందులో మోహినిగా మనోజ్‌కి అంతటి పేరు వస్తుందని చెప్తున్నారు. సినిమా ద్వితీయార్ధంలో మనోజ్‌ మోహినిగా విజృంభిస్తాడు.

Pandavulu Pandavulu Tummeda

విష్ణు మాట్లాడుతూ...ఈ సినిమాకి హీరో ఒక్కరే. ఆయన మోహన్‌బాబు. మిగిలిన వాళ్లంతా సపోర్టింగ్ యాక్టర్లమే. ఇంత పెద్ద తారాగణంతో 80 రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేశాం. మనోజ్, బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ విపరీతంగా నవ్విస్తాయి. అలాగే ఆడ వేషంలో ఉండే మనోజ్ వెంటపడే వ్యక్తిగా సుప్రీత్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మనోజ్ అందరి హృదయాల్నీ దోచుకుంటాడు. అతని నటనకు నేను గర్వంగా ఫీలవుతున్నాను. నేనైతే మనోజ్ కేరక్టర్‌ను చేసేవాణ్ణి కాను అన్నారు.

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ "మొదట ఈ సినిమాని మోహన్‌బాబు, విష్ణు హీరోలుగా అనుకుని మొదలుపెట్టాం. తర్వాత కథ మారింది. మనోజ్, వరుణ్, తనీశ్ పాత్రలు కూడా వచ్చి చేరి, 'పాండవులు పాండవులు తుమ్మెద' అయ్యింది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకుణ్ణవడం అదృష్టంగా భావిస్తున్నా. సెకండాఫ్‌కి మనోజ్ కేరక్టర్ హైలైట్. మూగవానిగా తనీశ్ మంచి నటన ప్రదర్శించాడు'' అని తెలిపారు.

మోహన్ బాబు మాట్లాడుతూ...''నేను పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించి పదేళ్లవుతోంది. నా కొడుకులు హీరోగా మంచి స్థానంలోకి వచ్చారు. ముగ్గురం కలసి నటిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కథ కోసం ఇన్నాళ్లు ఆగాం. 'రావణ' చేద్దామనుకుంటే దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా చేశాం. మేం అనుకున్నట్లుగా సినిమా చక్కగా వచ్చింది. రవి, కోనవెంకట్‌, బీవీఎస్‌రవి, గోపీమోహన్‌ చక్కటి కథని సిద్ధం చేశారు. దాన్ని శ్రీవాస్‌ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మంచు విష్ణు, మనోజ్‌, వరుణ్‌సందేశ్‌, తనీష్‌, రవీనాటాండన్‌, హన్సిక, ప్రణీత తమ పాత్రలమేరకు చక్కటి ప్రతిభకనబర్చారు. ఇంటిల్లిపాది చూసే సినిమాగా నిలుస్తుంది.'' అన్నారు.


పతాకం: శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు:మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ,రవీనా టండన్, హన్సిక, ప్రణీత తదితరులు
సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్,
కెమెరా : ఫలణికుమార్,
పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్,
మాటలు: డైమండ్ రత్న బాబు, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్,
పోరాటాలు: విజయ్,
ఎడిటింగ్: ఎంఆర్ వర్మ,
కళ: రఘు కులకర్ణి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్,
సమర్పణ: అవియానా-వివియానా,
నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్,
దర్శకత్వం: 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ .

English summary
Pandavulu Pandavulu Tummeda features Collection King Dr. Mohan Babu in a charming role as an intelligent tourist guide. Vishnu Manchu is portraying a role of an angry young man, while Manchu Manoj appears in dual role, which will keep you entertained in this out and out entertainer. The movie will hit the screens worldwide on January 31.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu