»   » మళ్లీ మోహన్‌బాబు సెటైర్స్

మళ్లీ మోహన్‌బాబు సెటైర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొదటి నుంచీ డైలాగులు పలకడంలో డాక్టర్ మోహన్‌బాబుది ఓ ప్రత్యేకమైన శైలి. 'నా రూటే సపరేటు', 'అరిస్తే కరుస్తా.. కరిస్తే అరుస్తా' వంటి డైలాగులతో గతంలో ఎన్నో సినిమాల్లో ఆయన అభిమానుల్ని ఆకట్టుకొన్నారు. కొంతకాలంగా ఆయన తరహా డైలాగులు వినిపించడంలేదనే అసంతృప్తితో ఉన్న వారికి తమ సినిమా 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం పూర్తి సంతృప్తి కలిగిస్తుందని చిత్ర నిర్మాతలు మంచు విష్ణు, మంచు మనోజ్ చెప్పారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకం వీరిద్దరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతోంది.

డా.మోహన్‌బాబు మాట్లాడుతూ ' దాదాపు పదేళ్ల అనంతరం నేను పూర్తి స్థాయి కథానాయకునిగా నటించిన సినిమా ఇది. ఈ చిత్రంలో నా తరహా సెటైరికల్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమది. మా మనోజ్ స్వయంగా డిజైన్ చేసిన పోరాట సన్నివేశాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే మా గురువు డాక్టర్ దాసరి నారాయణరావు ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర పోషించడం విశేషం' అని తెలిపారు.

నిర్మాత విష్ణు మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, తమ్ముడు, నేను, నాన్న కలిసి తొలిసారిగా నటించిన ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుందని, మనోజ్ పోషించిన లేడీగెటప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఈనెల 31న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు తప్పక విజయాన్ని అందిస్తారని కోరుకున్నారు

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
Mohan Babu is well known with his special style of dialogue delivery and thrill spectators to a great extent. The star is getting ready to bring his beat back with these kinds of dialogues in his upcoming film ‘Pandavulu Pandavulu Thummeda’ starring Manchu Vishnu and Manchu Manoj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu