»   »  నాలుక కంట్రోల్లో పెట్టుకో: అలీతో మోహన్ బాబు (వీడియో)

నాలుక కంట్రోల్లో పెట్టుకో: అలీతో మోహన్ బాబు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సోషల్ మీడియా లో రెండు రోజులుగా ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఫేస్ బుక్ గ్రూప్ ల్లో , పోస్ట్ లలో ఈ వీడియోని షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏముందీ వీడియోలో అంత గొప్ప కంటెంట్ అంటే..పెద్దగా ఏమీ లేదు..అలీని ఓ ఇంటర్వూలో భాగంగా మోహన్ బాబు నోర్ముయ్ అన్నారు.

Mohan Babu Says Hold your Tongue in Control To Ali

ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొందరు అభిమానులు, కాని వారు రకరకాల కామెంట్స్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. కొందరు మోహన్ బాబు ని సపోర్ట్ చేస్తున్నారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

నిజానికి అంత సీరియస్ మ్యాటరేం లేదు ఇక్కడ. మోహన్ బాబు చెప్తున్న విషయానికి అలీ అడ్డు తగులుతూంటే మోహన్ బాబు ఇలా అన్నారు. మోహన్ బాబు, అలీ కాంబినేషన్ లో అనేక చిత్రాలు వచ్చాయి. ఆ చనువు తోనే మోహన్ బాబు ఇలా చిన్నగా మందలించి ఉండవచ్చు.

ఇక ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుల కెరీర్ పైనే దృష్టి పెట్టారు. క్రితం సంవత్సరం ఆయన, అల్లరి నరేష్ కాంబినేషన్ లో వచ్చిన మంచు మామ, కంచు అల్లుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ చిత్రంలోనూ అలీ, మోహన్ బాబు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ ఆయన ఏ చిత్రమూ ఒప్పుకోలేదు. ఈ సంవత్సరం ఆయన తన బ్యానర్ లో నిర్మాతగా కొన్ని చిత్రాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

English summary
Watch Mohan Babu Says Hold Your Tongue In Control To Ali in an interviw.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu