»   » ఇండస్ర్టీ ఎవడబ్బ సొత్తు కాదు, వాడొక లఫూట్: మోహన్ బాబు

ఇండస్ర్టీ ఎవడబ్బ సొత్తు కాదు, వాడొక లఫూట్: మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు సినీ పరిశ్రమను ఉద్దేశించినచేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘దొంగాట' చిత్రం సక్సెస్ మీట్ లో పాల్గొన్న మోహన్ బాబు సినిమా ఇండస్ర్టీ ఎవడబ్బ సొత్తు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తానెప్పుడూ చిన్న నిర్మాతల పక్షానే ఉంటానని, చిన్న సినిమాలు తీసే వాళ్లే అసలైన నిర్మాతలు అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం పరిశ్రమలో మంచి నిర్మాతలు తగ్గిపోయారని, కొందరు పైనాన్షియర్ల సాయంతో భారీ బడ్జెట్‌ సినిమాలు తీసి నటులకు డబ్బులు ఎగ్గొడుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి వాడు నిర్మాత కాదు..దొంగ, లఫూట్ అంటూ ఫైర్ అయ్యారు. దౌర్జన్యాలు చేసే వారు కాలగర్భంలో కలిసి పోతారన్నారు. కొందరు దర్శకులు సైతం నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

 Mohan Babu sensational comments

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై త్వరలో స్పందిస్తానని మోహన్ బాబు స్పష్టం చేసారు. ఆయన ఈ వ్యాఖ్యల చేసింది నైజాం ఏరియాకు చెందిన ఓ బడా నిర్మాత నేతృత్వంలో కొందరు బడా నిర్మాతలు సిండికేట్ అవడం గురించే అని టాక్.

దొంగట సినిమా విషయానికొస్తే...మంచు లక్ష్మి-అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దొంగాట'. మంచు లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహించారు. కింగ్ నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రానా దగ్గుబాటి, నాని, తమిళ హీరో శింబు, తాప్సీ తదితరులు ఓ పాటలో సందడి చేసారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఫర్వాలేదనిపించే ఫలితాలు రాబట్టింది.

English summary
Mohan Babu sensational comments on tollywood.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu