»   » తెలంగాణ ఆవిర్భావం: మెగా హీరో, మోహన్ బాబు ఇలా...!

తెలంగాణ ఆవిర్భావం: మెగా హీరో, మోహన్ బాబు ఇలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావంపై నటుడు మోహన్ బాబు ట్వీట్ చేసారు. తెలంగాణలోని ప్రజలను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటూ సంబోధించిన ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలని, శాంతి, శ్రేయస్సు విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

మోహన్ బాబుతో పాటు సినీ రచయిత గోపీ మోహన్ కూడా ట్వీట్ చేసారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్, తెలంగాణకు మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ కూడా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా స్పందించారు. 'నవ తెలంగాణకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం సుభిక్షంగా శాంతితో విలసిల్లాలని కోరుకుంటున్నాను' అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేసాడు.

 Mohan Babu tweet on Telangana

కొన్ని రోజుల క్రితం...
గత కొన్ని రోజుల క్రితమే మోహన్ బాబు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అపుడు మోహన్ బాబు మాట్లాడుతూ....అన్న ఎన్టీఆర్ గారికి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు అని తెలిపారు. కేసీఆర్‌తో తనకు ఉన్న స్నేహాన్ని ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. పేదల భూములు కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్‌ను కోరినట్లు మోహన్ బాబు తెలిపారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Wishing the very best to all my brothers and sisters of Telangana. May all what was strived for come true. Peace and prosperity to all of us</p>— Mohan Babu M (@themohanbabu) <a href="https://twitter.com/themohanbabu/statuses/473172522452533249">June 1, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

కాగా...మోహన్ బాబు ఎవరి భూముల గురించి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసారు? అనేది ఆసక్తి కరంగా మారింది. ఆయన సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తుల గురించి ఫిర్యాదు చేసినట్లు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాల అండతో కొందరు సినీ ప్రముఖులు ఆక్రమించుకున్న పేదల భూములపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అయితే మోహన్ బాబు పనిగట్టుకుని వెళ్లి సదరు భూముల విషయమై ఫిర్యాదు చేయడం వెనక కారణం ఏమిటి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆక్రమణల విషయం కొత్త ప్రభుత్వం చూసుకుంటుంది కదా? మెహన్ బాబు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటి? ఎవరిపై కోపంతో ఆయన ఈ ఫిర్యాదు చేసారు? అనేది తేలాల్సి ఉంది.

English summary
"Wishing the very best to all my brothers and sisters of Telangana. May all what was strived for come true. Peace and prosperity to all of us" Mohan Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu