»   »  వరుణ్ సందేశ్‌కు మోహన్ బాబు వార్నింగ్, ఎందుకు?

వరుణ్ సందేశ్‌కు మోహన్ బాబు వార్నింగ్, ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుర్ర హీరో వరుణ్ సందేశ్‌కు వార్నింగ్ ఇచ్చాడట. అయితే, అది జరిగి చాలా కాలమే అవుతోంది. ఆ విషయం అప్పుడు బయటకు రాలేదు. కానీ ఇటీవల వరుణ్ సందేశ్ ఆ విషయాన్ని వెల్లడించాడు.

ఇదే తప్పు మళ్లీ చేస్తే ఈ సారి వార్నింగ్ ఇవ్వడం కాదు, వేరొకటి జరుగుతుందని మోహన్ బాబు ఆయన్ను హెచ్చరించాడు. మోహన్‌బాబుతో కలిసి వరుణ్ సందేశ్ 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సాయంత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోలు వరుణ్, తనీష్‌లు, హాస్యనటుడు కిశోర్ ఒక గదిలో బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నారు.

Mohan babu warns varun sandesh

ఇంతలో ఆ గదిలోకి వచ్చిన మనోజ్ ఎగిరి వాళ్లపై సరదాగా పడ్డాడట. దాన్ని మోహన్ బాబు చూశాడట. వెంటనే అందరినీ తన గదికి పిలిచారట. వారంతా గదిలోకి బిక్కు బిక్కుమంటూ వెళ్లారట. ఇంకేముంది, మొట్టి కాయలు తప్పలేదు.

'అదేంటయ్యా.. అలా పడుకున్నారు. సినిమా నటుడంటే ఎలా ఉండాలి. డిగ్నిఫైడ్‌గా ఉండాలయ్యా. ఇది మళ్లీ రిపీట్ అయ్యిందా.. ఈసారి వార్నింగ్ ఇవ్వను' అని హెచ్చరించారట. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ ఇటీవల ఒక టీవీ షోలో స్వయంగా చెప్పాడు.

English summary
Varun sandesh in a TV show revealed that Mohan babu has warned him few years back.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu