»   » మోహన్‌ బాబుకు నేడే అవార్డు ప్రదానం

మోహన్‌ బాబుకు నేడే అవార్డు ప్రదానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైలాగ్ కింగ్ పద్మశ్రీ మోహన్‌ బాబుకు చిత్తూరు వి. నాగయ్య అవార్డును ప్రదానం చేయనున్నారు. తొలి తరం నటుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన నాగయ్య 107వ జయంతి సందర్భంగా ఈ రోజు(సోమవారం) సాయంత్రం 6 గంటలకు స్థానిక జీఎన్ చెట్టిరోడ్డు వాణీమహల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ వేదిక పై నుంచే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మోహన్‌బాబు అందుకోనున్నారు. పద్మశ్రీ నల్లి కుప్పుస్వామి చెట్టి, సీనియర్ నటి రాజసులోచనలను కూడా సత్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఎంపీ టి.సుబ్బిరామి రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డిలు అతిథులుగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు సంస్థ తరపున ఆర్థిక సాయం అందిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

English summary
Veteran actor Mohan Babu is awarded with Nagayya award. A veteran of 500 films, Mohan Babu is noted for his versatility and his peculiar dialogue delivery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu