»   » "గువ్వా గోరింక"ల ప్రేమ కథ, సినిమాలో ఏముంటుందీ అంటే...!?

"గువ్వా గోరింక"ల ప్రేమ కథ, సినిమాలో ఏముంటుందీ అంటే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిన్న సినిమా అనగానే లో బడ్జెట్ సినిమా అనుకుంటున్న రోజుల్లో కూడా కొన్ని సినిమాలోస్తాయ్... థాట్ ఎంత రిచ్ గా ఉంటుందో, కథ చెప్పటం లోని ఫీల్ ఎంత రిచ్ గా ఉంటుందో చెప్పటానికన్నట్టు... గువ్వా గోరింక పోస్టర్, టీజర్ చూసినప్పుడు చాలామంది ఫీలయ్యిందిదే...

మోహన్ బొమ్మిడి

మోహన్ బొమ్మిడి

టీజర్ లో కనిపించే స్టిల్, వినిపించిన బ్యాక్ గ్రౌండ్ ట్యూన్ తోనే తానేం తీయ బోతున్నాడో, ఎలాంటి అనుభూతిని ప్రేక్షకుల కోసం సిద్దం చేస్తున్నాడో చెప్పేసాడు దర్శకుడు మోహన్ బొమ్మిడి... రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్ట్రీలో మెరుగులు దిద్దుకున్న ఈ దర్శకుడు మొదటి సినిమానే ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీ ఎన్నుకున్నాడంటేనే రెగ్యులర్ పద్దతికంటే కాస్త తేడా అనిపిస్తుంది....

దళం జీవన్‌రెడ్డి

దళం జీవన్‌రెడ్డి

ఆకార్ మూవీస్ బ్యానర్ పై దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి ల నిర్మాణం లో వస్తున్న గువ్వా గోరింక షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి దిగింది టీమ్. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత సత్య దేవ్ పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరిలో విడుదల చేసారు.

టీజర్ కి మంచి రెస్పాన్స్

టీజర్ కి మంచి రెస్పాన్స్

అప్పట్లో ఈ టీజర్ కి మంచి రెస్పాన్సే వచ్చింది. సంగీత దర్శకుడు బొబ్బిలి సురేష్ అద్బుతమైన ట్యూన్లు ఇచ్చాడు అనే టాక్ ముందు నుంచే వినిపిస్తున్నా, అంతగొప్పగా ఏముంటుంది లే అనుకున్నవాళ్ళే ఎక్కువ అయితే... ఒక్క సారి అందరి అంచనాలూ తలకిందులయ్యేటట్టే ఉన్నాయి.

భిన్న మనస్తత్వం కలిగిన ప్రేమికుల కథ

భిన్న మనస్తత్వం కలిగిన ప్రేమికుల కథ

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక. విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల ఈ ప్రేమకథను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు.

rn

సంగీతం సురేష్ బొబ్బిలి

కొత్తతరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రమిది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, సినిమాటోగ్రఫి: మైల్స్ రంగస్వామి, ఆర్ట్: సాంబ, కాస్ట్యూమ్స్: వినూత్న శత్రు, ఎడిటర్: గ్యారి బిహెచ్.

English summary
Team "Guvva Gorinka" compleated its shooting part and started post production work
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu