Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సినిమా డర్టీనా? మిగితా ప్రపంచం క్లీనా? ఆకట్టుకొంటున్న సమ్మోహనం టీజర్
సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సమ్మోహనం. బాలీవుడ్ అందాల సుందరీ అదితీరావు హైదరీ ఈ సినిమాలో సుదీర్ బాబు సరసన నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ ను మే డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చెయ్యడం జరిగింది.
టీజర్ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. సినిమాలంటే ఇష్టం లేని అబ్బాయి, ఓ హీరోయిన్ మధ్య నడిచే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. అష్టా చెమ్మా, జెంటిల్ మెన్ లాంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. మరోసారి తనదైన మార్క్‌తో సున్నితమైన కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
సినిమా, సాహిత్యం బతికే ఉంటాయి అని నరేష్‌తో చెప్పించిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలే డర్టీనా? మిగితా ప్రపంచమంతా క్లీనా అని హీరోయిన్ ప్రశ్నించడాన్ని చూస్తే ప్రేమికుల మధ్య ఉండే అభ్యంతరాలు టీజర్‌లో కనిపించాయి. దీంతో ఈ చిత్రం రొమాంటిక్, ప్రేమకథగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
టీజర్ చూసిన తర్వాత మంచి ఫీల్ గుడ్ సినిమా ద్వారా సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కనిపిస్తోంది. పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 15న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.