»   » పోస్టర్లు చూస్తేనే ఇలాఉంది... ఇక పులి వేట మొదలైతే..? మోహన్ లాల్ మన్యం పులి

పోస్టర్లు చూస్తేనే ఇలాఉంది... ఇక పులి వేట మొదలైతే..? మోహన్ లాల్ మన్యం పులి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగులో మోహన్ లాల్ మల్లూవుడ్ లో చేసిన పులి మురుగన్ సినిమాతో మరోసారి తన విశ్వరూపాన్ని చూపాడు. దసరా కానుకగా మలయాళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్స్ రాబడుతుంది. మల్లూవుడ్ చరిత్రలోనే అల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన పులి మురుగన్ సినిమా త్వరలోనే తెలుగులో సందడి చేయనున్నది.

ఈ చిత్రాన్ని 'మన్యం పులి'గా తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. 'సౌత్‌ ఇండియా నుంచి 'బాహుబలి' తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్‌ అందుకున్న చిత్రమిది. కలెక్షన్ల పరంగా మాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇప్పుడు తెలుగులోకి కూడా రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలనివ్వనుందీ, మన తెలుగు సినిమా మార్కెట్ లో మోహన్ లాల్ సినిమా ఎంతమేరకు ప్రభావం చూపనుందీ..?? ఈ అంశాల నేపథ్యం లో మన్యం పులి గా రానున్న పులి మురుగన్ పై చిన్న లుక్

 పులి వేటగాడి కథ:

పులి వేటగాడి కథ:


అటవీ సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తాడు అతను. వెదురు బొంగులు విక్రయిస్తుంటాడు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లినప్పుడు పలు జంతువులతో ముఖ్యంగా పులులతో పోరాడాల్సి వస్తుంది. పులి వేటలో నిష్ణాతుడైన ఓ మనిషి కథ మన్యం పులి. అలాంటి వ్యక్తి సమాజంలోని కొందరు అవినీతిపరులపై ఎలాంటి పోరాటం సాగించాడు? అందుకు గల కారణమేమిటి? అనేది సినిమాలో ఆసక్తిని కలిగిస్తుంది. ఆ క్రమంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారట.

15 కోట్లకి పైగా కలెక్షన్స్:

15 కోట్లకి పైగా కలెక్షన్స్:

మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 15 కోట్లకి పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ విజువల్ వండర్.

 మన్యం పులి

మన్యం పులి


ఈ విజువల్ వండర్ ను తెలుగులో "మన్యం పులి" పేరుతో శ్రీసరస్వతి ఫిలిమ్స్ పతాకంపై కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విడుదలైన తొలివారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పులి మురుగన్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి సినిమా తర్వాత ఆ ఘనత ఈ సినిమాకి దక్కడం విశేషం. ఇక ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం సౌత్ అగ్ర నిర్మాణ సంస్థలు పోటీపడినా.....వ్హివరకు శ్రీ సరస్వతి ఫిలిమ్స్ కి దక్కడం విశేషం.

 రెండు సంవత్సరాలు పాటు:

రెండు సంవత్సరాలు పాటు:


ఈ నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాట ఫుల్ క్రేజ్ రావడంతో, అదే...ఊపులో 'మన్యంపులి' సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా నవంబర్ లో 'పులి మురుగన్' తెలుగు వెర్షన్ 'మన్యం పులి' ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత కృష్ణా రెడ్డి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటుఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.

 సిందూరపువ్వు కృష్ణారెడ్డి:

సిందూరపువ్వు కృష్ణారెడ్డి:


కృష్ణారెడ్డి గతంలో అనువాద సినిమాగా సింధూరపువ్వు ని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకోవడంతో సిందూరపువ్వు కృష్ణారెడ్డిగా తెలుగునాట ప్రాముఖ్య పొందారు. ఆ తర్వాత అయన విడుదల చేసిన మరొక అనువాద సినిమా సాహసఘట్టం కూడా భారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘పులిమురుగన్' చిత్రాన్ని సైతం కృష్ణారెడ్డి తెలుగునాట పెద్ద హిట్ చేస్తారని మళయాల వెర్షన్ నిర్మాత తోమిచమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

 జగపతి బాబు :

జగపతి బాబు :


అంతే కాదు మన జగపతి బాబు ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాడు. కాబట్టి ‘మన్యం పులి' తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. స్టయిల్ మార్చిన తర్వాత జగపతిబాబుకు బోలెడ్ ఆఫర్స్ వస్తున్నాయి. చిన్నాచితక వదిలేసి.. బడా స్టార్స్ పక్కనే నటిస్తూ సెలక్టివ్ గా దూసుకుపోతున్నాడు. ఆ క్యారెక్టర్ కు జగపతి అయితే కరెక్ట్ అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్నా.. రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన మళయాళ మూవీ ఆఫర్ ను మాత్రం వదులుకోలేకపోయాడంట.

 యోధ:

యోధ:


90ల్లో మోహన్ లాల్ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదమయ్యాయి. ‘యోధ' లాంటి సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపే వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు తెలుగులోకి డబ్ చేయడం మానేశారు. ఐతే ఈ మధ్యే మనమంతా.. జనతా గ్యారేజ్ లాంటి డైరెక్ట్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాడు ఈ మలయాళ సూపర్ స్టార్.

 వారం రోజుల్లోనే :

వారం రోజుల్లోనే :


ఈ నేపథ్యంలోనే లాల్ కొత్త సినిమాను తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమానే ‘పులి మురుగన్'. ఈ చిత్రం మలయాళంలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయింది. వారం రోజుల్లోనే రూ.35 కోట్లు కొల్లగొట్టిందీ సినిమా.కేరళ లాంటి తక్కువ థియేటఋలుండే ఒక చిన్న రాష్ట్రం లో ఇది అత్యంత భారీ కలెక్షన్ల కిందే లెక్క. ఇక అక్కడే అంత పెద్ద మొత్తం అంటే ఇక తెలుగులో గనక క్లిక్ అయ్యిందీ అంటే ఇక ఈ సినిమా తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టేసినట్టే

 దర్శకుడు - వైశాఖ:

దర్శకుడు - వైశాఖ:


అలానే మల్లూవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న మోహన్ లాల్ ‘పులి మురుగన్'.. ‘మన్యంపులి'గా తెలుగునాట కూడా తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు : వైశాఖ, కథ: ఉదయకృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షాజీకుమార్.

English summary
The Telugu dubbed version of Kollywood blockbuster and Mohanlal-starrer Pulimurugan is slated for release in November this year. Titled as Manyam Puli in Telugu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu