»   » దాసరి నన్ను బూటు కాలితో తన్నారు.. ఆ క్రెడిట్ ఆయనదే.. మోహన్‌బాబు

దాసరి నన్ను బూటు కాలితో తన్నారు.. ఆ క్రెడిట్ ఆయనదే.. మోహన్‌బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా పరిశ్రమలో కృతజ్ఞత అనే మాటకు అంతగా విలువ ఉండదు. ఆపదలో ఆదుకొన్న వారిని సక్సెస్ వచ్చిన తర్వాత మరచిపోవడం చాలా సహజమైన విషయం. కానీ దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావుతో ప్రముఖ నటుడు మోహన్‌బాబు అనుబంధం ప్రత్యేకమైనది. సినీ జీవితాన్ని ప్రసాదించిన దాసరి అంటే మోహన్ బాబుకు చెప్పలేనంత ప్రాణం. మహోన్నత దర్శకుడు దాసరి ఆకస్మిక మరణంతో కన్నీటి పర్యంతమైన మోహన్‌బాబు.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇటీవల మీడియాతో పంచుకొన్నారు.

హీరో, హీరోయిన్లు ఏరీ..

హీరో, హీరోయిన్లు ఏరీ..

సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు చేతి మీదిగా సహాయం పొందినవారు ఎంతో మంది ఉన్నారు. దాసరి చాలా మందికి జీవితాలను ప్రసాదించారు. అయితే దాసరి చనిపోయినప్పుడు ఆయన నుంచి లబ్ది పొందినపుడు చాలా మంది రాకపోవడంపై మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి అండతో స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిన వారెవరూ కనిపించలేదు అని మోహన్‌బాబు అన్నారు.

దాసరిగారిని పరిశ్రమ పట్టించుకోలేదు..

దాసరిగారిని పరిశ్రమ పట్టించుకోలేదు..

గురువుగారు దాసరి చనిపోయినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ పట్టించుకోలేదన్నది వాస్తవం.. వాస్తవం. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గుర్తింపు తెచ్చిన గొప్పవ్యక్తికి అంతిమ వీడ్కోలు పలికిన తీరు చాలా బాధించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరుపడం నిజంగా హ్యాట్సాఫ్ అని మోహన్‌బాబు తెలిపారు.

ఇరువై టేకులు తిన్నా

ఇరువై టేకులు తిన్నా

నటుడిగా నాకు జీవితాన్ని ప్రసాదించింది దాసరిగారే. స్వర్గం నరకం చిత్రంలో ఒక సీనులో డైలాగులు చెప్పలేక ఇరవై టేకులు తిన్నా. దాంతో కోపగించుకొన్న దాసరి నన్ను బూటు కాలితో తన్నారు. డైలాగ్‌ చెప్పడం రావట్లేదని తిట్టారు. చివరకు సరిగ్గా చెప్పా. అలాంటి సందర్భాల్లో సినిమా మానేసి, ఇంటికి వెళ్ళిపోదామని కూడా అనిపించింది. కానీ, అందరూ వారించడంతో ఉండిపోయాను అని ఆ రోజులను మోహన్‌బాబు గుర్తు చేసుకొన్నారు.

డైలాగ్ కింగ్ అనడానికి కారణం..

డైలాగ్ కింగ్ అనడానికి కారణం..

ఇప్పుడు నన్ను డైలాగ్ కింగ్ అని చెప్పడానికి కారణం నా గురువు దాసరి గారే. దాసరి శిక్షణలో రాటుదేలడం వల్లే చాలా సినిమాల్లో పేజీల కొద్దీ డైలాగులను అవలీలగా చెప్పే స్థాయికి చేరుకొన్నాను. దట్‌ క్రెడిట్‌ గోస్‌ టు మై గురు దాసరి గారు. నీ క్రమశిక్షణే నీ బిడ్డలకూ వచ్చిందని దాసరి అనేవారు అని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.

డజను కార్లతో కాన్వాయ్

డజను కార్లతో కాన్వాయ్

దాసరి నారాయణరావు వరుస చిత్రాలతో విజయాలు సాధిస్తున్న సమయంలో స్టార్ హీరోలు కూడా ఆయన ఇంటి ముందు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు కూడా దాసరి సలహాలను, సూచనలను పాటించేవారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి, గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి దాసరి అని రాఘవేంద్రరావు తండ్రి ప్రకాశరావుగారు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి షూటింగ్ ముగించుకొని చెన్నైకి వచ్చిన సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో డజన్ల కొద్ది నిర్మాతలు కార్లతో వరుస కట్టే వారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మోహన్‌బాబు పంచుకొన్నారు.

English summary
Actor Mohanbabu shares his memories with director Dasari Narayana Rao. He said many of artists who get Dasari's help.. did not turn to his funerals. He reveals dasaris legendary things with media recently. he recollected that once dasari kicks with his leg when he was not delivered dialougue properly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu