»   »  మోహన్ బాబు అన్న ప్రేమ

మోహన్ బాబు అన్న ప్రేమ

Posted By:
Subscribe to Filmibeat Telugu
మోహన్ బాబు మరోమారు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో జరుగుతున్న యూత్ ఫెస్టివల్ కు ముఖ్యఅతిథిగా ఈ నెల 12న వెళ్లాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు తనదైన స్టయిల్ లో మట్లాడాడు. ఆయన మాటల్లోనే... నా గురించి ఎవరేమనుకున్నా పరవాలేదు...వైస్-చాన్సలర్ కు ఒక విషయం చెబుతున్నాను...ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు తీవ్రకృషి చేసిన ఎన్టీరామారావు విగ్రహానికి పూలమాల వేయకుండా యూనివర్సిటీ అంతా అలంకరించారు ఎందుకని...నేను పూలమాల వేద్దామంటే ఆ విగ్రహం పైకి వెళ్లడానికి మెట్లు లేవు...అవి కట్టించడానికి యూనివర్సిటీ వద్ద డబ్బులేకుంటే ఎన్ని లక్షలు ఇవ్వడానికైనా నేను సిద్దం..అన్నాడు మోహన్ బాబు. మోహన్ బాబు మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం అంతా సైలెంట్ అయిపోయింది. దటీజ్ మోహన్ బాబు...డైలాగ్ కింగ్ బిరుదు ఊరికే రాలేదు కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X