twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్‌బాబుకు అరుదైన గౌరవం.. సినీ ప్రస్థానంలో మరో మైలు రాయి.

    తెలుగు సినిమా చరిత్రలో మంచు మోహన్ బాబుది ఎదురులేని ప్రస్థానం. రిల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ నటుడు, నిర్మాత, రాజకీయ వేత్తగా అనేక పాత్రలు పోషించారు

    By Rajababu
    |

    తెలుగు సినిమా చరిత్రలో మంచు మోహన్ బాబుది ఎదురులేని ప్రస్థానం. రిల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ నటుడు, నిర్మాత, రాజకీయ వేత్తగా అనేక పాత్రలు పోషించారు. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

    ఎంజీఆర్ యూనివర్సీటీ

    ఎంజీఆర్ యూనివర్సీటీ

    తాజాగా మోహన్ ‌బాబును ఎంజీఆర్ యూనివర్సీటీ గౌరవ డాక్టరేటుతో గౌరవించింది. అక్టోబర్ 4వ తేదీన జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును మోహన్ బాబుకు అందజేయనున్నారు. గౌరవ డాక్టరేట్ లభించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయన కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

    సినీరంగంలో ప్రవేశించడానికి

    సినీరంగంలో ప్రవేశించడానికి

    మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాలెం లో 19 మార్చి 1952న జన్మించారు. మద్రాసులో సైన్స్‌లో డిగ్రీని పుచ్చుకొన్నారు, సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్థ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యారు.

    దాసరి నారాయణరావు శిష్యుడిగా

    దాసరి నారాయణరావు శిష్యుడిగా

    సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్‌ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది.

    మా అధ్యక్షుడిగా

    మా అధ్యక్షుడిగా

    ఆ తర్వాత మెహన్ బాబు సుమారు 600 చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది.

    25% విద్యార్థులకు ఉచిత విద్య

    25% విద్యార్థులకు ఉచిత విద్య

    చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు స్థాపించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందిస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిస్తుంది. అంతేకాకుండా 25% విద్యార్థులకు వారి ఆర్ధిక స్థోమత ప్రాతిపదికన కుల మతాలకు అతీతంగా ఉచిత విద్యను అందిస్తుంది విద్యానికేతన్.

    రాజ్యసభ సభ్యుడిగా

    రాజ్యసభ సభ్యుడిగా

    తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు. తాజాగా ఆయన నటించి నిర్మిస్తున్న 'గాయత్రి' అనే చిత్రం షూటింగ్ తో బిజీ గా ఉన్నారు.

    నటుడిగా 40 వసంతాలు

    నటుడిగా 40 వసంతాలు

    నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన 'ఏషియన్ లైట్' వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. అదే కార్యక్రమంలో ఆయనకు 'ప్రనామ్' అనే అవార్డు తో సత్కరించి, ఆయన చిత్రాల లోని ఉత్తమ డైలాగులను ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

    English summary
    Versatile actor The Mohanbabu will be conferred with honorary doctorate by prestigious MGR University. He will be awareded the honor on October 4th in Chennai. In this occasion, Many Tollywood personalities congratulated Mohan Babu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X