twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ లాల్‌కు అంత సీన్ ఉందా? మనీ వేస్ట్: 1000 కోట్ల మహాభారతంపై.... సెటైర్!

    ‘మోహన్ లాల్ సార్... మిమ్మల్ని చూస్తుంటే చోటాభీమ్ లా ఉన్నారు. మీ లాంటి వారు మహాభారతంలో భీముడి పాత్రను ఎలా చేస్తారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మోహన్ లాల్ ప్రధాన ప్రాత్రలో ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్‌తో 'మహాభారతం' ప్రాజెక్టును తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుండగా.... ఈ సినిమాపై బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ వివాదాస్పద కామెంట్స్ చేసారు.

    ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాండామూజమ్ నవల ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మహాభారతంలో భీముని పాత్ర కోణంలో, పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బి.ఆర్.శెట్టి అనే నిర్మాత రూ. వెయ్యి కోట్లతో సినిమాను తీయబోతున్నారు.

    మోహన్ లాల్ భీముడి పాత్రకు సెట్టవ్వడు

    మోహన్ లాల్ భీముని పాత్రకు అస్సలు సెట్టవ్వడు, నిర్మాత బిఆర్ శెట్టి డబ్బలు వేస్ట్ చేయొద్దు అంటూ కమల్ రషీద్ ఖాన్ అడ్వైజ్ ఇచ్చాడు.

    మోహన్ లాల్ ను కించపరుస్తూ ట్వీట్

    మోహన్ లాల్ ను కించపరుస్తూ ట్వీట్

    మోహన్ లాల్ ను కించపరుస్తూ కమల్ రషీద్ ఖాన్ ట్వీట్ చేసాడు. ‘మోహన్ లాల్ సార్... మిమ్మల్ని చూస్తుంటే చోటాభీమ్ లా ఉన్నారు. మీ లాంటి వారు మహాభారతంలో భీముడి పాత్రను ఎలా చేస్తారు. బీఆర్ శెట్టి డబ్బును ఎందుకు వేస్ట్ చేయాలనుకుంటున్నారు అంటూ ట్వీట్ చేసాడు.

    మోహన్ లాల్ అండ్ టీం రియాక్షన్

    మోహన్ లాల్ అండ్ టీం రియాక్షన్

    అయితే కమల్ రషీద్ ఖాన్ కామెంట్లపై మోహన్ లాల్ అండ్ టీం.... డిగ్నిఫైడ్ సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. మోహన్ లాల్ స్థాయికి ఏ మాత్రం సరిపోని వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారంటున్నారు.

    మోహన్ లాల్ లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు

    మోహన్ లాల్ లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు

    రాండామూజమ్... మహాభారతంలోని భిన్నకోణాన్ని చూపిస్తుంది. ఇందులో భీముడి పాత్రకు మోహన్ లాల్ తప్ప మరెవరూ సెట్టవ్వరని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ అంటున్నారు. ఒకవేళ మోహన్ లాల్ నటించడానికి ఒప్పుకుని ఉండకపోతే ఈ ప్రాజెక్టు మెటెరియలైజ్ అయ్యేది కాదని ఆయన అన్నారు.

    శ్రీ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్

    శ్రీ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్

    ఇది శ్రీకుమార్ మీనన్ డ్రీమ్ ప్రాజెక్ట్. దేశంలో మోస్ట్ పాపులర్ యాడ్ ఫిల్మ్ మేకర్స్ లో ఆయన ఒకరు. రాండమాజమ్ నవల అంటే నాకు ఎంతో పాషన్. ఇలాంటి నవలను సినిమాగా తీసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.

    స్టార్ కాస్ట్, టైటిల్

    స్టార్ కాస్ట్, టైటిల్

    ఈ సినిమాలో తారాగణం ఎంపిక చేసేందుకు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఓ ఇంటర్నేషనల్ కాస్టింగ్ ఏజెన్సీని రంగంలోకి దింపింది. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. మళయాలంలో ఈచిత్రం రాండమాజమ్ గా రీలీజవుతుందని, ఇతర భాషల్లో ‘మహాభారత' పేరుతో రిలీజవుతుందని తెలిపారు.

    1000 కోట్ల బడ్జెట్ ఎందుకు?

    1000 కోట్ల బడ్జెట్ ఎందుకు?

    ఈ సినిమాను భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రూపొందించాలనుకుంటున్నారు. అందుకు తగిన విధంగానే హైస్టాండర్డ్స్ తో సినిమాను తీయడానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ తీసుకోనున్నారు. స్టంట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ ఇప్పటికే సెలక్ట్ అయ్యాడు. అయితే ఇంత భారీ ప్రాజెక్టును రిస్ట్రిక్టెడ్ బడ్జెట్ లో తీయడం కష్టం. సినిమాను ఆల్ టైం క్లాసిక్ గా నిలబెట్టేందుకు, భావితరాలకు ఆదర్శంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. అందుకే వెయ్యి కోట్ల బడ్జెట్ అని దర్శకుడు తెలిపారు.

    రెండు భాగాలుగా..

    రెండు భాగాలుగా..

    ఈ సినిమాను రెండు భాగాలుగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2018 సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2020 నాటికి మొదటి భాగం రిలీజ్ చేసేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Mohanlal, the complete actor is all set to play the central character in India's most expensive project Mahabharata aka Randamoozham. Now, Mohanlal has been trolled by the self-proclaimed film critic Kamaal R Khan aka KRK. Shockingly, KRK has openly stated he feels Mohanlal is totally unfit for the role fo Bheem in Mahabharata, and has advised him to not wasted the money of producer BR Shetty. It is for the first time, KRK is taking a dig on a Malayalam actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X