»   »  తెలుగు నేర్చుకుంటున్న సూపర్ స్టార్

తెలుగు నేర్చుకుంటున్న సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగులో రెండు చిత్రాలు సైన్ చేసారు. కొరటాల శివ, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఈ రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు పూర్తిగా అర్దమైతేనే మరింత సమర్దవంతంగా నటించే అవకాసం ఉంటుందని ఇలా ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇటీవల దృశ్యం సినిమాతో సంచలనాలు సృష్టించిన మోహన్ లాల్ ఆ చిత్రంపై ప్రక్క ఇండస్ట్రీ కూడా ప్రేమ తెచ్చుకునేలా చేసాడు.మలయాళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాగా తెలుగు,తమిళం,హిందీ భాషల్లోను విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.మోహన్ లాల్ నటించిన దృశ్యం చిత్రం ఓ మధ్య తరగతి కుటుంబ నేపధ్యంతో తెరకెక్కగా,ఇప్పుడు మరోసారి అలాంటి కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మోహన్ లాల్ .

Mohanlal learning Telugu

సుదీర్ఘ విరామం తర్వాత మోహన్ లాల్ తెలుగులో ఓ చిత్రాన్ని చేస్తుండగా,దీనికి చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించనున్నారు.ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించనున్నారు.

అయితే చిత్రం ఒకేసారి తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో రూపొందనుండగా,నాలుగు మధ్యతరగతి కుటుంబాలు చేసే ప్రయాణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని చిత్ర నిర్మాత తెలియజేశారు.

English summary
Mohanlal has decided to hone his Telugu speaking skills. He has roped in a trainer and is working on the ways to refine his language.
Please Wait while comments are loading...