'జనతాగ్యారేజ్': నిర్మాతకు, టీమ్ కు షాక్ ఇచ్చిన మోహన్ లాల్
హైదరాబాద్ : ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం "జనతా గ్యారేజ్". మోహన్‌లాల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ చిత్రం టీమ్ కు, నిర్మాతలకు తన రెమ్యునరేషన్, రైట్స్ విషయమై షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు రెమ్యునేషన్ గా 1.5 కోట్ల రూపాయలతో పాటు మలయాళ హక్కులు కావాలని మోహన్‌లాల్ కోరడం జరిగింది . దీనికి నిర్మాతలు కూడా పాజిటివ్‌గానే స్పందించినట్టు ఓకే అన్నారు. వారి లెక్కలు ప్రకారం మరో కోటిన్నర మళయాళ రైట్స్ వెళ్తాయని అంచనా వేసారు.
ఫోటో గ్యాలెరీ :ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ లాంచ్
అయితే.. నిర్మాతలకు మతులు పోగొట్టే రేంజ్ లో మోహన్ లాల్ "జనతా గ్యారేజ్" మలయాళ డబ్బింగ్ రైట్స్ ను ఏకంగా 4 కోట్ల రూపాయలకు అమ్మేశాడని సమాచారం. దాంతో.. మోహన్ లాల్ కు ఈ చిత్రం రెమ్యునేషన్ గా .. మొత్తం అయిదున్నర కోట్లు చేరాయి. ఈ విషయం తెలుసుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ షాక్ కు గురయ్యారని చెప్పుకుంటున్నారు.

ఈ విషయం తెలుగు సినీ పెద్దలను అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో వైపు మళయాళిలకు మాత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవిస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, కొరటాల శివ డైరక్షన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెదలైన సంగతి తెలిసిందే. కాకపోతే మెహాన్ లాల్ కు సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు ఈ మధ్యే తీసారు. అన్ని ఇంచుమించు ఓకే టేక్ లో అవ్వడంతో డారక్టర్ సైతం షాక్ అయ్యరు. దీనితో పాటు తెలుగులోనే డైలాగ్స్ అన్ని చెప్పడంతో మరింత సర్ ప్రైజ్ అయ్యారని తెలుస్తోంది.
ఈ సినిమాలో మోహన్ లాల్.. ఎన్టీఆర్ కి ఫాదర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ ఆవార్డ్ తీసుకున్న మోహన్ లాల్, ఇటు ఎన్ఠీఆర్ చాలా ఎగ్జైట్ మెంట్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వున్నికృష్ణ ముకుందం నెగిటివ్ రోల్ ప్లే చెస్తున్నారు. ఈ క్రేజీ కాంబిలో సినిమా వస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు, అటు మళయాళి ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











