»   » ప్చ్... రీమేక్ కోసం మన హీరోలు వెంటబడ్డా ఫలితం లేదు,నో చెప్తున్నారు

ప్చ్... రీమేక్ కోసం మన హీరోలు వెంటబడ్డా ఫలితం లేదు,నో చెప్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక భాషలో ఓ చిత్రం వచ్చి హిట్టైందంటే మిగతా భాషల వాళ్ల కళ్లు అన్నీ ఆ సినిమా పైనే ఉంటాయి. డబ్బింగ్ చేసో, రీమేక్ చేసో సొమ్ము చేసుకోవాలనుకుంటారు. దాంతో భారతీయ భాషలన్నిటిలోకి హిట్ సినిమా లు వెళ్లూంటాయి. అయితే అలా వెళ్లాలంటే ఆ సినిమా సబ్జెక్ట్ యూనివర్శల్ అయ్యిండాలి. లేకపోతే దాని జోలికి ఎవరూ వెళ్లరు. అన్ని నేటివిటీలకు సరిపోయే అలాంటి సినిమాలు తక్కువగానే వస్తూంటాయి. ఇప్పుడు మళయాళంలో అలాంటి చిత్రమే వచ్చింది.


మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రెండు వారాల క్రితం రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది.

చిత్రం తమిళ రీమేక్ ని కమల్, హిందీలో అక్షయ్ చేయటానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం బెంగాళి రైట్స్ ని ఓ కార్పోరేట్ సంస్ద చేజిక్కించుకోగా, కన్నడ రైట్స్ ని కూడా అమ్ముడుపోయినట్లు సమాచారం. కన్నడంలో ఓ తెలుగు దర్శకుడు ఈ రీమేక్ చేస్తాడని వినపడుతోంది.

ఇక తెలుగు విషయానికి వస్తే... ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం వెంకటేష్ వంటి హీరోలు,సాయి కొర్రపాటి వంటి స్టార్ నిర్మాతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు ఈ చిత్రం రీమేక్ చేయటానికి ఆసక్తి చూపెడుతున్నా..మోహన్ లాల్ మాత్రం రైట్స్ ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూడటం లేదని వినికిడి. జనతాగ్యారేజ్, మనమంతా సినిమాలతో తనకు తెలుగులో ఏర్పడ్డ మార్కెట్ తో ఈ సినిమాని ఇక్కడ బిజినెస్ చేసి విడుదల చేయాలనకుంటున్నారు.

అలాగే మోహన్ లాల్ స్వయంగా తను నటించిన వెర్షన్ తోనే తెలుగులో కనిపించాలనికుంటున్నట్లు చెప్తున్నారు. రీమేక్ చేస్తే వేరే హీరోకు ఆ హిట్ ఖాతాలో పడుతుంది. అదే తన డబ్బింగ్ సినిమా ఆడితే, తనకు పేరు , డబ్బు, ఇక్కడ మరిన్ని ఆఫర్స్ తో పాటు, తెలుగులోనూ ఆయన పాగా వేయటానికి కుదురుతుంది. దాంతో ఆయన, ఇక్కడ తెలుగు లో మరో నిర్మాతతో పాటు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కు ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.

Mohanlal's 'Oppam' to be remade in other languages

ఈ చిత్రంలో మోహన్ లాల్.. జయరామన్ అనే పాత్రలో అంధుడిగా కనిపించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి విజయవంతమైన ఈ చిత్రం తెలుగువారికీ నచ్చుతుందని భావిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు చిత్రం ఘన విజయం సాధించింది. ఆయన్ను రీమేక్ కోసం చాలా మంది అడిగినా నో చెప్పి రిలీజ్ చేసి, తెలుగులోనూ పెద్ద హిట్ కొట్టారు. తెలుగులోనూ ఇప్పుడు ఆయన ప్రతీ సినిమాకూ ఇక్కడ మార్కెట్ మొదలైంది. చూస్తూంటే మోహన్ లాల్ అదే స్కూల్ లో వెళ్తున్నట్లున్నారు.

English summary
Mohanlal's "Oppam" has turned out to be a big hit, winning critical appreciation as well as commercial success at the box office. As a result, makers of movies in other indian industries are now ready to recreate the Malayalam film in other languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu