»   » ‘మన్యం పులి’ హిట్.. ఈ నెల్లోనే మోహన్ లాల్ మరో మూవీ వస్తోంది!

‘మన్యం పులి’ హిట్.. ఈ నెల్లోనే మోహన్ లాల్ మరో మూవీ వస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ 'పులి మురుగన్' తెలుగులో 'మన్యం పులి'గా విడుదలైన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ నటించిన మరో మలయాళ చిత్రం తెలుగులో విడుదలకు సిద్దమవుతోంది.

2016 ఓనం కానుకగా విడుదలైన 'ఒప్పం' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత దిలీప్ కుమార్ బొలుగోటి ఈచిత్రం తెలుగు హక్కులు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి 'కనుపాప' లేదా 'వాచ్ మెన్ జైరాం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒప్పం' చిత్రంలో మోహన్ లాల్ అంధుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది.

ఈ చిత్రం తమిళ రీమేక్ ని కమల్, హిందీలో అక్షయ్ చేయటానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం బెంగాళి రైట్స్ ని ఓ కార్పోరేట్ సంస్ద చేజిక్కించుకోగా, కన్నడ రైట్స్ ని కూడా అమ్ముడుపోయినట్లు సమాచారం. కన్నడంలో ఓ తెలుగు దర్శకుడు ఈ రీమేక్ చేస్తాడని వినపడుతోంది.

Oppam

ఇక తెలుగు విషయానికి వస్తే... ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం వెంకటేష్ వంటి హీరోలు,సాయి కొర్రపాటి వంటి స్టార్ నిర్మాతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు ఈ చిత్రం రీమేక్ చేయటానికి ఆసక్తి చూపెడుతున్నా..మోహన్ లాల్ మాత్రం రైట్స్ ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూడటం లేదని వినికిడి. జనతాగ్యారేజ్, మనమంతా, మన్యంపులి‌తో తనకు తెలుగులో ఏర్పడ్డ మార్కెట్ తో ఈ సినిమాని ఇక్కడ బిజినెస్ చేసి విడుదల చేయాలనకుంటున్నారు.

English summary
Mohanlal's another Malayalam blockbuster 'Oppam' has got its Telugu title. The film has been titled 'Kanupapa'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu