Don't Miss!
- News
Roja: రోజా మేడమ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్, ఆంధ్రా కిరాయి హంతకులు, తుపాకితో బెదిరించి !
- Sports
INDvsNZ : ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. దీపక్ హుడాకు దిగ్గజం మద్దతు!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
1000 కోట్ల మహాభారతంలో ప్రధాని మోదీ జోక్యం.. టైటిల్ వివాదం కొత్త మలుపు!
భారతీయ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మహాభారతం సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ రచించిన రాండమూజమ్ ఆధారంగా తీయబోయే చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ భీముడు పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందించనున్న ఈ చిత్రానికి ప్రముఖ యాడ్ ఫిలిం మేకర్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రం 2020లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్ర టైటిల్‌కు సంబంధించి తాజాగా తలెత్తిన వివాదంలో ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ జోక్యం కల్పించుకోవడం చర్చనీయాంశమైంది.

టైటిల్ మార్చండి.. హిందూ సంస్థ అల్టిమేటం..
ప్రతిష్టాత్మకంగా మహాభారతాన్ని తెరకెక్కించాలన్న తపనతో చిత్ర యూనిట్ ముందుకెళ్తుండగా, సినిమా టైటిల్ మార్చాలంటూ కేరళ హిందూ ఐక్య వేదిక అల్టిమేటం ఇచ్చింది. మహాభారతం టైటిల్‌ను ఉపయోగించుకోవద్దని హెచ్చరించింది. దాంతో ఈ సినిమా టైటిల్‌ను మహాభారత అని మార్చేందుకు చిత్ర నిర్వాహకులు ఒప్పుకొన్నారు. అయితే ఊహించని విధంగా ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి నిర్వాహకులకు మద్దతు లభించడం కేరళలో చర్చనీయాంశమైంది.

చిత్ర యూనిట్‌కు ప్రధాని మద్దతు
ప్రధాని మోదీ మద్దతుపై చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. ప్రధాని మోదీ నుంచి లేఖ అందింది. దేశానికి గర్వకారణంగా నిలిచే విధంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా ఆసక్తితో ఉన్నాను అని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధానితో సమావేశానికి అపాయింట్‌మెంట్ కావాలని కోరగా అందుకు పీఎంవో సానుకూలంగా స్పందించినట్టు సినీ వర్గాలు తెలిపాయి.

ఆ టైటిల్ హక్కులు వ్యాసుడికే
అయితే ఈ వివాదంపై కేరళ హిందూ ఐక్య వేదిక ప్రసిడెంట్ కేపీ శశికళ మాట్లాడుతూ.. మహాభారతం కథా నేపథ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఓ భారీ బడ్జెట్ సినిమా రావడం గర్వంగా ఉంది. ఈ సినిమా కథ మహాభారతానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. వ్యాసుడు రాసిన మహాభారతం పేరును ఉపయోగించుకోవడానికి వీలు లేదు. మరే చిత్రం మహాభారతం పేరును వాడుకోవద్దు. ఒకవేళ రాండమూజమ్ పుస్తకంగా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కితే ఆ పేరునే వాడుకొవాలి. మహాభారతం అనే పేరుపై హక్కులు కేవలం వ్యాసుడికే చెందుతాయి అని ఆమె అన్నారు.

బైబిల్ సినిమా పేరు చూడండి..
గతంలో బైబిల్ ఆధారంగా డావిన్సి కోడ్ సినిమాను డాన్ బ్రౌన్ సినీ దర్శకుడు నిర్మించాడు. ఆ చిత్ర కథ బైబిల్‌కు మరో వెర్షన్. ఆ సినిమా కథను బైబిల్ నుంచి సంగ్రహించకపోవడం వల్ల ఆ పేరు పెట్టుకోలేదు అనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

చిత్ర యూనిట్‌కు పీఎంవో అపాయింట్‌మెంట్
ఎవరూ ఊహించని విధంగా మహాభారతం చిత్రంపై ప్రధాని మోదీ ఆసక్తి చూపడంపై మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరడం మరింత ఆసక్తిని పెంచింది. మహాభారతం టైటిల్ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే విషయంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.