Just In
- 1 min ago
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 34 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 53 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
Don't Miss!
- News
అర్నబ్‌తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Sports
మ్యాచ్‌కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Automobiles
ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోహన్ లాల్ స్కెచ్ మామూలుగా లేదుగా, తెలుగులో మరొక సూపర్ హిట్ కి సై
హైదరాబాద్: మన హీరోలు మళయాళం,తమిళ లాంగ్వేజ్ లలోనూ తమ మార్కెట్ ని పెంచుకోవాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారో తెలిసిందే. ఇప్పుడు మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కూడా తెలుగులో కు పూర్తి స్దాయిలోకి రావాలని చూస్తున్నారు. ఆయన సైతం మళయాళం లోనే కాకుండా తమిళ,తెలుగు లలో మార్కెట్ విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా రీసెంట్ గా యేలేటి దర్శకత్వంలో వచ్చిన మనమంతా, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రాలలో చేసారు. తెలుగు వారికి మోహన్ లాల్ తన నటనా స్టామినా ఏంటో చెప్పేలా ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. మనమంతా చిత్రం ఓకే అనిపించుకున్నా, జనతాగ్యారేజ్ మాత్రం రికార్డ్ లు బ్రద్దలుకొట్టింది. తాజాగా ఆయన మరో సినిమాతో తెలుగువారిని పలకరించటానికి సిద్దపడుతున్నారు.

మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రెండు వారాల క్రితం రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది. చిత్రం తమిళ రీమేక్ ని కమల్, హిందీలో అక్షయ్ చేయటానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం వెంకటేష్ వంటి హీరోలు,సాయి కొర్రపాటి వంటి స్టార్ నిర్మాతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అందుకు కారణం మోహన్ లాల్ స్వయంగా తను నటించిన వెర్షన్ తోనే తెలుగులో కనిపించాలనికోవటం. రీమేక్ చేస్తే వేరే హీరోకు ఆ హిట్ ఖాతాలో పడుతుంది. అదే తన డబ్బింగ్ సినిమా ఆడితే, తనకు పేరు , డబ్బు, ఇక్కడ మరిన్ని ఆఫర్స్ తో పాటు, తెలుగులోనూ ఆయన పాగా వేయటానికి కుదురుతుంది. దాంతో ఆయన, ఇక్కడ తెలుగు లో మరో నిర్మాతతో పాటు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కు ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో మోహన్ లాల్.. జయరామన్ అనే పాత్రలో అంధుడిగా కనిపించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి విజయవంతమైన ఈ చిత్రం తెలుగువారికీ నచ్చుతుందని భావిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు చిత్రం ఘన విజయం సాధించింది. ఆయన్ను రీమేక్ కోసం చాలా మంది అడిగినా నో చెప్పి రిలీజ్ చేసి, తెలుగులోనూ పెద్ద హిట్ కొట్టారు. తెలుగులోనూ ఇప్పుడు ఆయన ప్రతీ సినిమాకూ ఇక్కడ మార్కెట్ మొదలైంది. చూస్తూంటే మోహన్ లాల్ అదే స్కూల్ లో వెళ్తున్నట్లున్నారు.