»   » నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు.. మోక్షఙ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు.... 2017 లో ప్రార

నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు.. మోక్షఙ్ఞ మొదటి సినిమా డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు.... 2017 లో ప్రార

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ తనయుడు యువరత్న నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఆరంగ్రేటం చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేదానిపై టాలీవుడ్‌లో రకరకాల గుసగుసలు దాదాపు సంవత్సరం నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. మోక్షు తెరంగ్రేటం విష‌యాన్ని బాల‌య్య సైతం ఇప్ప‌టికే రెండు మూడు సార్లు స్వ‌యంగా చెప్పాడు. 2017లో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉండ‌నుంది.

వ‌చ్చే యేడాది ప్రారంభోత్స‌వం జ‌రుపుకునే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీని బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడైన టాప్ ప్రొడ్యుస‌ర్ సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై సాయి ఇప్ప‌టికే బాల‌య్య నుంచి హామీ పొంది మోక్షు డేట్స్ కూడా తీసుకున్నాడ‌ట‌. మోక్షు సినిమా కోసం సాయి కొర్ర‌పాటి ఓ ఆస‌క్తిక‌ర టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు తెలుస్తోంది.మోక్ష‌జ్ఞ కోసం ఇప్ప‌టి వ‌ర‌కు క‌థ‌లు ఏవీ ఫైన‌లైజ్ చేయ‌క‌పోయినా టాలీవుడ్ టాప్ రైట‌ర్ ఓ క‌థ సూచించాడ‌ని, ఆ క‌థకు అనుగుణంగా సాయి 'రానే వచ్చాడయ్య ఆ రామయ్య' అన్న టైటిల్ రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు టాక్‌ కూడా చాలారోజులనుంచే వినిపిస్తోంది.

Mokshagna Debut Film With Director Krish

అయితే ఇప్పుడు తెలిసిన ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే.... నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి చాలా రోజులుగా రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు.. ఎవరి దర్శకత్వంలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు.

బాలయ్య వందో సినిమాలో మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగినా.. ఆ విషయంపై కూడా నందమూరి కుటుంబ సభ్యులు, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.,,అయితే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి బాలకృష్ణ డైరెక్టర్ ను ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో క్రిష్ పనితీరు నచ్చిన బాలయ్య, అతని దర్శకత్వంలోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను 2017 చివర్లోగాని 2018 మొదట్లో గాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్ర బ్యానర్ పై రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read more about: mokshagna
English summary
Balakrishna has now developed good bond with his director of "Gauthamiputra Satakarni" so much so that he has reportedly asked him to direct his son Mokshagna's maiden film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu