»   »  బుల్లి తెరపై మోనికా బేడీ?

బుల్లి తెరపై మోనికా బేడీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Monica Bedi
శిల్పాశెట్టి ఇప్పుడు బిగ్ బాస్ -2 అనే టీవీ రియాలిటీ షో కి ప్రయోక్తగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బ్రదర్ స్ధాయి విజయాన్ని అందుకోవటానికి ఈ పోగ్రాంలో కాంట్రావర్శి పీపుల్ ని ఆహ్వానిస్తున్నారు నిర్మాతలు .ఇందులో భాగంగానే అబుసలీమ్ కేసులో నిందితురాలుగా జైలు శిక్ష అనుభవించి బయిటకు వచ్చిన మోనికా బేడీ ని అడిగారని తెలుస్తోంది.ఇక మోనికాబేడీ అప్పట్లో తెలుగులో శ్రీకాంత్ తో తాజ్ మహల్ చిత్రంలోనూ,మోహన్ బాబుతో సోగ్గాడి పెళ్ళాం సినిమాలలో నటించింది.అయితే ఆమె జైలు నుండి బయిటకు వచ్చిన తర్వాత చాలా మంది హాట్ హాట్ ఆఫర్స్ తో ముందుకొచ్చారు. ఆమె కొచ్చిన క్రేజ్ చేసుకుందామనే వారి ఆలోచన ఆమె ముందుచూపుతో ఆగిపోయింది.ఇక ఇప్పుడు షెర్లిన్ చోప్రాని ఈ పోగ్రాం కోసం ఒప్పించిన నిర్మాతలు మోనికాకూడా వస్తే తమ పోగ్రాంకి ప్రత్యేక క్రేజ్ వస్తుందంటున్నారు.ఇక ఇప్పటికే భారీ పబ్లిసిటీ చేస్తున్న ఈ పోగ్రాం కోసం రెమ్యునేషన్స్ కూడా భారీగానే ఎర చూపుతున్నట్లు సమాచారం.ఇక బిగ్ బాస్-2 ఆగస్టు 17 నుండి ప్రారంభం కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X