»   » ముంబై బీచుల్లో చెత్త ఎత్తేస్తోంది: నమ్మగలరా ఆమె బాలీవుడ్ హీరోయిన్

ముంబై బీచుల్లో చెత్త ఎత్తేస్తోంది: నమ్మగలరా ఆమె బాలీవుడ్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి సినిమా తారలు కేవలం నటనకే పరిమితమయ్యేవారు. ఆ తర్వాత తరంవారిలో కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే సామాజిక సేవా కార్యక్రమాల్లో సినిమా తారలు పాల్గొనడం చాలా అరుదు. కానీ ఇప్పటి తరం తారలు మాత్రం నటనతోపాటు సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు.

ఇటువంటివారిలో ముందుంటుంది దియా మీర్జా. తారగా, అందాల పోటీల్లో విజేతగా నిలిచిన దియా సామాజిక కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటుంది. బాలీవుడ్ లో ఒకదశలో అగ్ర నటిగా ఉన్న దియా నిర్మాతగా కూదా మారి చేతులు కాల్చుకుని ఆ తర్వాత పెళ్ళి చేసుకొని తెరకి దూరమైంది.

Morning After Ganesh Visarjan, Dia Mirza Helps Clean Juhu Beach

అయితే తెరకు మాత్రమే దూరమైంది గానీ తాను చేసే సేవా కార్యక్రమాలకు కాదు.. . రీసెంట్ గా ముంబైలో గణేష్ చతుర్ధి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గణేష్ నిమజ్జనం కూడా పూర్తయిపోగా.. ముంబై బీచులు అన్నీ విపరీతమైన చెత్తా చెదారంతో నిండిపోయాయి. దీంతో తనకు తనే చొరవ తీసుకుని ఈ చెత్తను శుభ్రం చేసే పనిలో నిమగ్నమై పోయింది దియా మీర్జా. ఇందుకోసం తనే ఇనీషియేట్ తీసుకుని పలువురు విద్యార్ధులతో కలిసి జుహూ బీచ్ శుభ్రం చేసే పనిలో నిమగ్నమై పోయింది.

Morning After Ganesh Visarjan, Dia Mirza Helps Clean Juhu Beach

అందాల తార అయినా సరే.. సెలబ్రిటీ స్థాయి ఉన్నా సరే.. ఇలా చెత్తలో మునిగితేలుతూ తనంతట తనే ఓ మంచి కార్యక్రమాన్ని ఆచరిస్తున్న దియా మీర్జాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛ్ భారత్ అంటూ ఫోటోల కోసం పోజులు ఇచ్చే సెలబ్రిటీలు మన చుట్టూ ఉన్న కాలంలో.. స్వయంగా చొరవ తీసుకుని మరీ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న దియా మీర్జాను ప్రశంసించాల్సిందే.

English summary
Dia Mirza has recently participated in the cleaning of clutter from the Juhu beach in Mumbai, She revealed that nearly 400 tonnes of material has been cleared from the beach.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X