»   » సుధీర్ బాబు డైలాగ్: మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ....

సుధీర్ బాబు డైలాగ్: మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు బావ సుధీర్ బాబు త్వరలో ‘మోసగాళ్లకు మోసగాడు' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఓ సన్నివేశంలో ‘ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి' అని తన స్నేహితుడు అడిగిన ప్రశ్నకు సుధీర్ బాబు స్పందిస్తూ ‘మా బావ దగ్గర నేర్చుకున్నా' అంటూ సమాధానం ఇస్తాడు.

సినిమాలో సన్నివేశం, డైలాగ్ ఎవరిని ఉద్దేశించో తెలియదు కానీ..... మహేష్ బాబు అభిమానులు మాత్రం సుధీర్ బాబు డైలాగ్ తన బావ మహేష్ బాబును ఉద్దేశించే అని ఊహించుకుని తెగ సంబర పడిపోతున్నారు. సుధీర్ బాబు కథానాయకుడిగా లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘స్వామిరారా' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. నందిని కథానాయిక.


Mosagallaku Mosagadu movie dialogue in talk

నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ‘12 శతాబ్దానికి చెందిన విక్రమాదిత్య మహారాజు తయారుచేయించిన అతి విలువైన సీతారాముల విగ్రహాల్ని దొంగిలించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమయ్యాయి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వినోదానికి ప్రాధాన్యముంటుందని తెలిపారు.


సుధీర్‌బాబు పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. మణికాంత్ ఖాద్రి స్వరాలకు చక్కటి స్పందన లభిస్తుంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. సప్తగిరి, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.

English summary
Inside the trailer of "Mosagallaku Mosagadu", as his friend asks "Where did you got this intelligence from", Sudhir answers "Learnt it from my brother-in-law" (Ma baava daggara nerchukunna). This revelation will not be surely about Mahesh Babu but some other character inside the movie, however fans are for the now connected with Mahesh only.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu