For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గదిలో హీరో,హీరోయిన్-భయపెట్టిన దెయ్యం(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఒంటిరిగా..ఏకాంతంగా ఎవరూ లేని ప్లేసులో కాసేపు రొమాన్స్ చేసుకుందామని ఏ పాత ఇంటికో వెళితే అక్కడ అప్పటికే మకాం వేసిన దెయ్యాలు ఎటాక్ చేస్తే ఎలా ఉంటుంది. ఎంతసేపూ లవ్ స్టోరీలేనా...భయపెట్టే సినిమాలు కూడా భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తాయి అనేది మన సినిమా వాళ్లూ అర్దం చేసుకున్నారు. ముఖ్యంగా లో బడ్జెట్ సినిమాలకు ఈ హర్రర్ సినిమాలు ప్రాణం పోస్తున్నాయి. కెమెరా యాంగిల్స్ కొత్తగా ఉండేటట్లు చూసుకుంటే, స్టార్స్ లేకపోయినా నడస్తాయని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. ఇదే థీరిని నమ్మి త్వరలో బాలివుడ్ కొన్ని సినిమాలను ముందుకు తెస్తోంది.

  ఇప్పటికే పలు భయానక సినిమాలు విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రేమకథలకే కాదండోయ్‌ హారర్‌ చిత్రాలకు బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానం ఉందని ఇవి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ, విక్రమ్ భట్, మహేష్ భట్ లాంటి వాళ్లు ఇలాంటి సినిమాలకు ఫ్యాక్టరీలా తయారయ్యారు.

  గతంలో వచ్చిన మహల్‌, పురాణామందిర్‌, వీరానా, దహశత్‌, సన్నాటా, పురానా హవేలి, బంద్‌దర్వాజా, జానీ దుష్మన్‌, భూత్‌, రాజ్‌లాంటి బాలీవుడ్‌ సినిమాలు సూపర్‌ హిట్టయ్యాయి. హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లరుగా మనముందుకొచ్చింది మర్డర్‌-3. అదే బాటలో ఈ ఏడాది మరికొన్ని హారర్‌ చిత్రాలు సందడి చేయనున్నాయి. త్వరలో బాలీవుడ్ ని పలకరించనున్న హర్రర్ చిత్రాలను పరిశీలిద్దాం..

  స్లైడ్ షో లో భయపెట్టే ...బంగారాలు గురించి...

  3జీ

  ఈ చిత్రంలో హీరో,హీరోయిన్స్ గా నీల్‌నితిన్‌ ముఖేష్‌, సోనాల్‌ చౌహాన్‌లు నటిస్తున్నారు. శ్యామ్‌ సెకెండ్‌ హ్యాండ్‌ 3జీ సెల్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తాడు. ఫిజీలో ఓ అజ్ఞాత మహిళ నుంచి ఫోన్‌ కాల్‌ రావడం, తదనాంతరం జరిగిన పరిణామాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2013, మార్చి 15న విడుదల కానుంది.

  ఏక్‌ థీ దయాన్‌

  ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్‌, విశాల్‌ భరద్వాజ్‌లు కలిసి నిర్మించారు. ఇందులో ఇమ్రాన్‌ హష్మీ, హుమాఖురేషీ, కొంకణా సేన్‌, కల్కికొచ్చిన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం ఓ మెజీషియన్‌ బోబో (Bobo) జీవితగాథ ఆధారంగా రూపొందించారు. ఏప్రిల్‌ 18, 2013న విడుదలకు సిద్ధమైంది.

  రాగిణి ఎం.ఎం.ఎస్‌ 2

  ఇందులో శృంగార నటి సన్నీలియోన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే రాగిణి ఎంఎంఎస్‌ చిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఒక యువతి నిజమైన ప్రేమగాథను చిత్రంగా రూపొందించారు. రాజధాని వ్యాప్తంగా ఈ ప్రేమకథకు సంబంధించిన ఎం.ఎం.ఎస్‌. సందేశాలు పంపబడుతాయి. ఆ ఎం.ఎం.ఎస్‌ లో ఏముంటుందనేది చిత్ర కథ. ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై వెండితెరకెక్కిస్తున్నారు. అక్టోబర్‌ 11, 2013న ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  ఆత్మ

  ఈ చిత్రంలో బిపాసాబసు, నవాజుద్దీన్‌ సిద్ధిఖీలు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో తండ్రి ఆత్మ ఒక బాలిక చుట్టూ పరిభ్రమిస్తూ బాలికను తన వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇందుకు తల్లి అభ్యంతరం తెలుపుతూ సాగే థ్రిల్లింగ్‌ హారర్‌ కథగా రూపొందింది. ఈ చిత్రం విడుదల తేదీని మార్చి 22, 2013 గా నిర్ణయించారు.

  ముంబాయి125 K.M

  ఈ చిత్రంలో పాకిస్థాన్‌ నటి వీణామాలిక్‌ ఒక దెయ్యం పాత్రను పోషిస్తున్నారు. ముంబయి జాతీయ రహదారిపై పరిభ్రమిస్తూ మానవరక్తం తాగేందుకు ప్రయత్నించే సన్నివేశాలతో చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు నిర్మాతలు కసరత్తులు చేస్తున్నారు.

  English summary
  
 As the year draws to a close, it is customary to take a look back at the horror we’ve been given over the past 12 months. After you’ve debated your list, and argued with others about theirs, it’s time to start thinking about the new feast of horror that will be hitting your eyes in the coming months.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X