»   » మైగ్గాడ్..!! బాహుబలి షూట్ కోసం ఇంత సెక్యూరిటీనా..!? అసలేమిటింత సీక్రేట్...

మైగ్గాడ్..!! బాహుబలి షూట్ కోసం ఇంత సెక్యూరిటీనా..!? అసలేమిటింత సీక్రేట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ ప్రాంతీయ భాషా సినిమాగా తెరకెక్కిన బాహుబ‌లి సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి రిలీజ్ అయ్యి యేడాది దాటుతున్నా ఆ సినిమా ఇంకా రికార్డుల ప‌రంప‌ర కంటిన్యూ చేస్తోంది. బాహుబ‌లి గురించి చీమ‌చిటుక్కుమ‌న్నా అది మీడియాకు పెద్ద వార్త‌లా అయిపోయింది. అలాంటి హైప్ చాలా తెలివిగా క్రియేట్ చేసుకున్నాడు రాజ‌మౌళి.బాహుబలి 2 చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 28 ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈలోపు బాహుబలి2 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి.

ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం విశేషాలకు వస్తే.. 2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్న షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.


ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాహుబ‌లి రూ.600 కోట్ల వ‌సూళ్లు సాధించి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాహుబ‌లి - ది బిగినింగ్ పార్ట్‌కు కొన‌సాగింపుగా బాహుబ‌లి-2 (బాహుబ‌లి - ది క‌న్‌క్లూజ‌న్‌) తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుపుకుంటున్న బాహుబ‌లి-2 వ‌చ్చే యేడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో సాగుతోంది. తాజా గా షూటింగ్ లొకేషన్ ల లోకి ముగ్గురినే అనుమతించి కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య కొన్ని సీన్లు తీసాడు... అవేమిటో తెలుసా..? ఆ విశేషాలు స్లైడ్ షోలో....


బాహుబ‌లి-2

బాహుబ‌లి-2

బాహుబ‌లి-2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.350 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని జాతీయ మీడియాలు జోరుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ చిత్రం త‌మిళ హ‌క్కులు రూ.50 కోట్ల‌కు అమ్ముడ‌వ్వ‌గా..... ఓవ‌ర్సీస్ హ‌క్కులు రూ.37 కోట్ల‌కు డీల్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.


భారీ ఎత్తున బిజినెస్

భారీ ఎత్తున బిజినెస్

తెలుగులో కూడా అన్ని ఏరియాల‌కు భారీ ఎత్తున బిజినెస్ జ‌రుగుతోంది. జాతీయ మీడియా అంచ‌నాల ప్ర‌కారం బాహుబ‌లి-2 రూ.1000 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.బాహుబలి విడుదల సమయంలో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఒత్తిడి ఉండేది.


ఇప్పుడంత ఒత్తిడి లేదు

ఇప్పుడంత ఒత్తిడి లేదు

కానీ, రెండో భాగం విషయంలో మాత్రం చిత్ర బృందం కొంత ప్రశాంతంగా ఉందని చెప్పింది. మొదటి భాగానికి ప్రేక్షకుల నుంచి దక్కిన అపూర్వ ఆదరణే అందుకు కారణం.


మరింత జాగ్రత్త

మరింత జాగ్రత్త

ఇలాంటి సమయం లో ఏమాత్రం పొరపాటు జరిగినా సినిమా ఫలితాలు తారుమారే... అందుకే ప్రతీ చిన్న విషయాన్నీ ఎంతో ఓపికగా ఏ పొరపాటూ జరగకుండా చూసుకుంటున్నాడు రాజమౌళి.


ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు

ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు

ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు సినిమాలోని "కీ" సీన్లని చిత్రీకరించేటప్పుడు ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు. కనీసం ఆయనకు దగ్గరివారికి కూడా ఈ విషయం లో మాత్రం దూరమే. కెమెరామెన్ సెంథిల్, రాజమౌళి...ఆ సీన్ లో ఉండాల్సిన నటీ నటులు తప్ప మరెవ్వరూ అక్కడ అడుగు పెట్టటానికి వీల్లేదంటూ ఆఙ్ఞలు జారీ చేసేసాడట.


ఒక్క మలుపు లీకయినా

ఒక్క మలుపు లీకయినా

ఎందుకంటే ఏఒక్క మలుపు లీక్ అయినా సినిమా సాధించబోయే వసూళ్ళమీదా..., రికార్డుల మీదా ఆ ప్రభావం పడుతుంది. అందుకే రాజమౌళి కొన్ని సీన్లలో ఆ సన్ని వెశం లో ఉండాల్సిన నటులని తప్ప మిగతా నటులనీ, వేరే విభాగాల టెక్నీషియన్లనీ దగ్గరికి రానివ్వటం లేదు....


ముగ్గురే

ముగ్గురే

తాజా గా తీస్తున్న సన్నివేశాలకోసం, అయితే ముగ్గురిని మాత్రమే అనుమతించాడట.... అది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పే సీన్ కావటం తో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు.


చిన్న పొరపాట్లని కూడా

చిన్న పొరపాట్లని కూడా

కనీసం మంచినీళ్ళూ, టచప్ బాయ్స్, కావాల్సిన టెక్నీషియన్లను కూడా రానివ్వకుండా ఆపనులన్నీ తానే స్వయంగా సమకూర్చుకుంటున్నాడట. ఎంత కూల్గా ఉన్నా ఈ విషయం లో చిన్న తేడావచ్చినా రాజమౌళి ఇర్రిటేట్ అయిపోతున్నాడట.


కరణ్ జోహార్

కరణ్ జోహార్

బాలీవుడ్ లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. తొలి భాగం కంటే భారీ స్థాయిలో బాహుబలి-2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి-2' రిలీజ్ కావడానికి ఇంకా సంవత్సరానికి పైగా టైం ఉంది.


భారీ ప్లానింగ్

భారీ ప్లానింగ్

ఈ గ్యాపులో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి పార్ట్ 1 విడుదల సందర్భంగా తెలుగునాట థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.


ఈసారి ఇబ్బందులుండవు

ఈసారి ఇబ్బందులుండవు

కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అలాంటి ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్ లాంటివి జరుగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేయనున్నారు.


English summary
Rajamouli has started filming the most key sequence of Bahubali 2. The news is that the ace director did not even allow even his crew members to be inside the location.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu