»   » అవి మరిగే...ఈ స్టార్స్ పెళ్లి వద్దంటున్నారా?(ఫోటో ఫీచర్)

అవి మరిగే...ఈ స్టార్స్ పెళ్లి వద్దంటున్నారా?(ఫోటో ఫీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సామాన్యుల వివాహం కన్నా సెలబ్రేటీల వివాహానికి సందడి ఎక్కువ. అయితే బాలీవుడ్ స్టార్ హీరో,హీరోయిన్స్ చాలా మంది వివాహం ఊసెత్తడం లేదు. బ్యాచులర్ లైఫే సో బెటర్ అంటూ సోలో గా పాటలు పాడుకుంటూ గడిపేస్తున్నారు. దాంతో అసలు ఈ స్టార్స్ ఎందుకు పెళ్లిళ్లు అంటే విముఖత చూపిస్తున్నారు...డేటింగ్,లివింగ్ రిలేషన్ షిప్ అంటేనే ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు...భాధ్యతలు అంటే ఇష్టపడటం లేదా..లేక పెళ్లి అయితే అవకాశాలు తగ్గుతాయని భావిస్తున్నారా ..ఒంటిరి జీవితం హ్యాపీ అన్న భావనకి వచ్చేసారా...అనే సందేహాలు అందరికీ కలుగుతున్నాయి.

  ఇంతకు ముందు హీరోలు మాత్రమే ముదురు బ్రహ్మచారులుగా మిగిలి ఎప్పుడో వివాహం అనే వారు అరుదుగా ఉండేవారు. అయితే ఇప్పుడు చాలా మంది అలాగే కనిపిస్తున్నారు. డేటింగ్, సహజీవనం అంటూ కాలం తమకు నచ్చిన వారితో గడిపేస్తూ రోజులు నడిపేస్తున్నారు. హీరోయిన్స్ కూడా దీనికి మినహాయింపేమి కాదు. తమకు నచ్చినవారితో కావాల్సినంత కాలం లివింగ్ రిలేషన్ షిప్, డేటింగ్ అని తర్వాత ఎవరి మానాన వాళ్లు విడిపోయి వేరే పార్టనర్స్ ని వెతుక్కుంటున్నారు తప్ప లైఫ్ పార్టనర్స్ వైపు మ్రొగ్గు చూపటం లేదు.

  బాలీవుడ్ లో షారుఖ్‌కాన్‌, షాహిద్‌ కపూర్‌లకు మధ్య ఉన్న తేడా ఏమిటి అని ప్రశ్నిస్తే ఇద్దరూ మంచి నటులే. ఇద్దరికీ బ్యాంకుల్లో బోలెడు డబ్బుంది. వీరిలో ఒకరు మాత్రం కుటుంబపరంగా శృంగార జీవితాన్ని కోల్పోయారు. అతడే షాహిద్‌కపూర్‌. పెళ్లి, డబ్బు అనేవి మన బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

  బాలీవుడ్‌లో ఇలాంటివారు ఇంకెవరెవరున్నారో స్లైడ్ షో ద్వారా తెలుసుకుందాం.

  కత్రినాకైఫ్‌

  కత్రినాకైఫ్‌

  కత్రినాకైఫ్‌ ఎప్పుడూ వార్తల్లో నానుతున్న హీరోయిన్. కొంతకాలం సల్మాన్‌ఖాన్‌, ఇటీవల రణబీర్‌ కపూర్‌లతో డేటింగ్‌ చేసినట్లు ప్రచారం. ఆమెకింకా పెళ్లి కాలేదు. ధూమ్‌-3, బ్యాంగ్‌ బ్యాంగ్‌ లాంటి ప్రాజెక్టులు ఆమెకు మంచి అవకాశాలనిచ్చాయి. ప్రస్తుతం ఆమె బ్యాంకు ఖాతాలో రూ. 62.25 కోట్లు ఉన్నట్టు భోగట్టా. మరి పెళ్లి వైపు ఆమె చూపు పోలేదేమిటో అర్థంకాని ప్రశ్నే.

  ప్రియాంకా చోప్రా

  ప్రియాంకా చోప్రా

  రీసెంట్ గా రామ్ చరణ్ సరసన జంజీర్ రీమేక్ లో కనపించి తెలుగు వారిని సైతం అలరించిందీ ముదురు భామ. ప్రస్తుతం ఆమె చేతిలో 11 సినిమాలున్నాయి. బ్యాంకులో డబ్బుకు కొదవేం లేదు. ఇంకా పెళ్లి మాట మాత్రం ఎత్తడంలేదు. ఖాళీ ఉన్నప్పుడు తన మాజీ లవర్స్ తో అక్కడక్కడా కనపడి వార్తల్లో నిలుస్తూంటుంది.

  సల్మాన్‌ఖాన్

  సల్మాన్‌ఖాన్

  కండల వీరుడు మన సల్మాన్‌ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్‌ బ్యాడ్‌ బోయ్‌, హాటెస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌ లాంటి పేర్లెన్నో ఉన్నాయి. ఈ ముదురు బ్రహ్మచారికి దాదాపు రూ.144.25 కోట్ల మేరకు ఆస్తులు, నికర ధనం ఉన్నట్లు ప్రచారం. బాలీవుడ్‌ భామలతో చెట్టపట్టాలేసుకు తిరగడమే కానీ ఓ ఇంటివాడవుదామన్న ఆలోచన ఇప్పటికీ లేదు.

  కరణ్‌ జోహర్

  కరణ్‌ జోహర్

  దర్శకుడు, పార్ట్‌ టైం డిజైనర్‌ అయిన కరణ్‌ జొహార్‌ 'ధర్మ (ప్రొడక్షన్స్‌)' అధినేత. మంచి విజయాలను తన ఖాతాలో నమోదుచేసుకున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ధనవంతుడు కూడా. గోరీ తేరీ ప్యార్‌ మే, ఉంగ్లీ, హసీతో ఫాసీ, టు స్టార్స్‌, శుద్ధి, బత్తి మీజ్‌ దిల్‌, గుట్కా లాంటి సినిమాలు రానున్నాయి. ఎన్నున్నా పెళ్లి మాట ఎత్తడంలేదు. ఈ విషయంలో ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.

  బిపాసాబసు

  బిపాసాబసు

  ఇంకా పెళ్లి కావడంలేదేంటి బాసూ అని అందరూ అనుకుంటున్నా ఇంకా ఆమె చెవికెక్కినట్లు లేదు. సినిమా అవకాశాలు తగ్గినా పెళ్లి వూసు లేదు. ఆమె కలల రాకుమారుడు ఇంకా దొరకలేదేమో. మొన్నమొన్నటి వరకూ జాన్ అబ్రహం తో సహ జీవనం అన్న ఈమె ప్రస్తుతం మరో హీరో తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  ప్రీతిజింటా

  ప్రీతిజింటా

  ఐపీఎల్‌ కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ అధిపతి. ముద్దుగా బొద్దుగా కనిపించే ఈ సొట్టబుగ్గల చిన్నది కూడా పెళ్లి మాట ఎత్తడంలేదు. సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. బ్యాంకు బ్యాలెన్స్‌ బాగానే పెరిగింది. పారిశ్రామిక వేత్తలతో మంచి పరిచయాలున్నా తగిన వరుడు మాత్రం దొరకలేదేమో!

  జాన్‌ అబ్రహాం

  జాన్‌ అబ్రహాం

  ఇటీవలే నిర్మాతగా మారిన నటుడీయన. విక్కీ డోనార్‌, మద్రాస్‌ కేఫ్‌లతో బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టారు. ఈ ముదురు బ్రహ్మచారికీ తగిన సంబంధాలు ఇంకా దొరకలేదు. ఆ మధ్యన బిపాసాతో చాలా కాలం సహజీవనం చెయ్యటంతో అంతా వీరిద్దరికీ పెళ్లి అవుతుందని భావించారు.

  షాహిద్‌ కపూర్

  షాహిద్‌ కపూర్

  కరీనాకపూర్‌తో కొంతకాలం డేటింగ్‌ చేశాడు. ప్రేమ మిగిల్చిన చేదు అనుభవాలో ఏమో పెళ్లి అనే తీపి జ్ఞాపకానికి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది రాంబో, రాజ్‌కుమార్‌ అండ్‌ మిలన్‌ టాకీస్‌, ఫటా పోస్టర్‌ నిక్లా హీరో విజయవంతమయ్యాయి.

  అభయ్ డియోల్

  అభయ్ డియోల్

  పంజాబ్ ద పుట్టర్ అని బాలీవు్డ్ పిలుచుకునే అభయ్ డియేల్ కూడా పెళ్ళికి రెడీగా ఉన్నారు. కెరీర్ లో తనకంటూ ఓ రాచ మార్గం వేసుకుని, విభిన్నమైన పాత్రల ద్వారా దూసుకుపోతున్న అభయ్ డియోల్ కి ఇంట్లో వాళ్లు సంభందాలు చూస్తున్నారు. అయితే అభయ్ మాత్రం పెళ్లికి వాయిదాలు వేస్తున్నాడు. ప్రీతి దేశాయ్ అనే సూపర్ మోడల్ తో డేటింగ్ చేయటమే దీనికి కారణం అంటున్నారు.

  English summary
  Broken-hearted, career-driven, too young or too old –excuses are many when it comes to staying off the aisle or mandap. However, this only makes them all the more desirable. We bring you Bollywood’s most wanted bachelors.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more