»   » రెస్పెక్ట్ లేదు, అందుకే ఈ దరిద్రమైన పరిస్థితి: అల్లు అర్జున్ ఎమోషన్

రెస్పెక్ట్ లేదు, అందుకే ఈ దరిద్రమైన పరిస్థితి: అల్లు అర్జున్ ఎమోషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'డిజె' సక్సెస్ టూర్లో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అక్కడ ఓ చానల్ ఇంటర్వ్యూలో రివ్యూ రైటర్లు, పైరసీపై తనదైన శైలిలో స్పందించారు. పైరసీ అనేది ఫండమెంటల్‌గా వచ్చేది అది కాపీ చేసే వ్యక్తి వల్ల కాదని, అది చూసే జనాల వల్లే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మీరు పైరసీ చూడకపోతే వారెందుకు పైరసీ చేస్తారు? ప్రేక్షకులకు ది బెస్ట్ క్వాలిటీ అందించాలనే మేము ఎంతో కష్టపడతాం, ఎక్కడెక్కడి నుండో ఎంతో ఖర్చు పెట్టి టెక్నీషియన్స్ ను తీసుకొస్తాం. కానీ మీరు చీప్‌గా పైరసీ సీడీలు, టోరంట్, ఫేస్‌బుక్ లింక్‌లోనో చూస్తాను అనే ధోరణిలో ఉన్నంతకాలం పైరసీ ఇలానే ఉంటుందన్నారు. మేము మీకు ది బెస్ట్ ఇచ్చినపుడు మీరు కూడా ది బెస్ట్ గా రిసీవ్ చేసుకోవాలి. అపుడే ఒక బ్యూటీఫుల్ ట్రాన్‌జాక్షన్ జరుగుతుంది అని బన్నీ అన్నారు.


రేటింగ్ ఇవ్వడానికి మీరెవరు? సినిమా అనేది ఒక ఎమోషన్

రేటింగ్ ఇవ్వడానికి మీరెవరు? సినిమా అనేది ఒక ఎమోషన్

రివ్యూ అనేది సింగిల్ పర్సనల్ ఒపీనియన్. సినిమా ఒక కోటి మంది చూస్తే కోటి అభిప్రాయాలు ఉంటాయి. ఒక్కో వయసు వారు ఒక్కో రకంగా సినిమాపై ఒక అభిప్రాయానికి వస్తారు. వాళ్ల లైఫ్ అనుభవం నుండి సినిమా చూస్తారు. రివ్యూల పేరుతో మీ సొంత అభిప్రాయాలు రుద్ది ప్రేక్షకులను మభ్య పెట్టవద్దు. స్టార్ రేటింగ్స్ ఇవ్వడానికి మీరెవరు? ఒక హ్యూమానిటీకి, ఒక ఎమోషన్ కు స్టార్ రేటింగ్ ఏమిటి? సినిమా అనేది ఒక ఎమోషన్... అంటూ బన్నీ తనదైన శైలిలోలో వ్యాఖ్యానించారు.


ఇప్పుడు రివ్యూలు ఒక పెద్ద ఇష్యూ

ఇప్పుడు రివ్యూలు ఒక పెద్ద ఇష్యూ

ఒకప్పుడు రివ్యూలనేవి ఒక ఇష్యూ కాదు. ఇపుడు సినిమా ఎంజాయ్ చేయడం కంటే ఈ రివ్యూలు ఎక్కువగా కనపడుతున్నాయి. జనాలు వచ్చి సినిమా బావుంది సినిమా బావుంది అని మాకు చెబుతుంటారు. కానీ విజువల్‌గా పేపర్లు, వెబ్ సైట్లలో మరో రకంగా రాస్తున్నారు అని బన్నీ అన్నారు.


మన సినిమాపై రెస్పెక్ట్ లేదు

మన సినిమాపై రెస్పెక్ట్ లేదు

చాలా మంది రివ్యూ రైటర్లకు కమర్షియల్ సినిమాల మీద రెస్పెక్ట్ లేదు. ఒక సింగిల్ జోనర్ ఫిల్మ్ చేయడం చాలా చాలా ఈజీ, ఒక మల్టీ జోనర్ ఫిల్మ్ చేయడం చాలా కష్టం. మేము ఇంత కష్టపడుతున్నా వాళ్లకు రెస్పెక్ట్ లేదు అని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇలాంటి యూనిక్‌నెస్ ప్రపంచంలో ఎక్కడా లేదు

ఇలాంటి యూనిక్‌నెస్ ప్రపంచంలో ఎక్కడా లేదు

కమర్షియల్ సినిమా అంటే డాన్స్ ఉండాలి, పాటలుండాలి అంటే మ్యూజికల్ జోనర్, ఫైట్స్ ఉండాలి అంటే యాక్షన్ జోనర్. లవ్ ఉండాలి అంటే రొమాంటిక్ జోనర్, ట్విస్ట్ ఉండాలి అంటే థ్రిల్లర్ జోనర్, సెంటిమెంట్ ఉండాలి అంటే డ్రామా జోనర్... ఇన్ని జోనర్లు కలిపి ప్రపంచంలో ఎక్కడైనా సినిమాలు వస్తున్నాయా...? అంటూ బన్నీ ప్రశ్నించారు.


అందుకే ఇలాంటి దరిద్రం

అందుకే ఇలాంటి దరిద్రం

ఒక ఇంగ్లిష్ సినిమా ‘టైటానిక్' తీసుకుంటే కేవలం రెండు జోనర్లు కలుస్తాయి. లవ్, ఒక డ్రామా ఈ రెండు జోనర్లు మాత్రమే. ఒక తెలుగు లేదా సౌతిండియన్ మూవీ కమర్షియల్ ఫార్మాట్ కొచ్చేసరికి మల్టీ జోనర్ ఫిల్మ్. వరల్డ్ వైడ్ ఎక్కడా లేనటువంటి యూనిక్ నెస్ ఉంటుంది. మన యూనిక్ నెస్‌ను మనం ఓన్ చేసుకోక పోవడం వల్ల వచ్చిన దరిద్రం ఇది అంటూ... బన్నీ ఫైర్ అయ్యారు.


అసలెక్కడా ఇలాంటి లేవు

అసలెక్కడా ఇలాంటి లేవు

కమర్షియల్ సినిమాలో ఉండే ఇంకో యూనిక్ నెస్ ఏమిటంటే వరల్డ్ సినిమాలో ఎక్కడా ఇంటర్వెల్ అనేది ఉండదు. మన దగ్గరే ఉంది. ఇంటర్వెల్ సమయంలో మనం లేచి మళ్లీ ఇంకో సినిమా చూస్తాం. ఇదో యూనిక్ పాయింట్. ఫారినర్స్ వచ్చి మన సినిమా చూసినపుడు మధ్యలో సినిమా ఆపేశారని ఆశ్చర్యపోతారు. అది మన యూనిక్ నెస్, మన కల్చర్... అని బన్నీ తెలిపారు.


తెల్లోడిలాగా తీస్తే గొప్ప సినిమానా?

తెల్లోడిలాగా తీస్తే గొప్ప సినిమానా?

మన యూనిక్ నెస్ మనం ఓన్ చేసుకోకుండా ఎవడో తెల్లోడి లాగా తీస్తే గొప్ప సినిమా, ఒక జోనర్లో తీస్తే గొప్ప సినిమా అనడం సరికాదు. మన విషయాన్ని మనం గొప్పగా, అందంగా చెప్పుకుంటేనే అది గొప్ప సినిమా అవుతుంది. ఇవాళ ప్రపంచం, భారతదేశం మొత్తం బాహుబలిని గొప్ప సినిమా అన్నారు. ఎందుకు? పాటలుంటాయి, ఫైట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. అది మన ఒరిజినాలిటీ. ఇండియన్స్ మెంటాల్టీ అది అని బన్నీ అన్నారు.


రెస్పెక్ట్ ఇవ్వండి

రెస్పెక్ట్ ఇవ్వండి

మనం తినేపుడు కూడా సింగిల్ డిష్ ఇస్తే సరిపోదు. స్వీటు కావాలి, హాటు కావాలి, బిర్యానీ కావాలి, డ్రింక్ కావాలి... అన్నీ కావాలి. సినిమా విషయంలో కూడా మనం అలాగే ఆలోచిస్తాం. మన యూనిక్ నెస్‌ను మనం ప్రమోట్ చేసుకోవాలి. రివ్యూ రైటర్లు ముందు మన కమర్షియల్ సినిమా పవర్ తెలుసుకోవాలి. మోస్ట్ డిఫికల్ట్, వైడెస్ట్ రీచ్ ఉన్న సినిమా కమర్షియల్ సినిమా. ముందు దానికి రెస్పెక్ట్ ఇవ్వండి....అని బన్నీ కోరారు.


English summary
Allu Arjun made some sharp comments on review writers. While travelling on a chartered flight from Chicago to another destination in Bay Area, USA, Bunny expressed that review rating system and pushing audiences to watch a film basing on that rating system is wrong.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu