twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్‌కి గురి చేస్తున్న విక్రమ్‌ ‘ఐ’ (కొత్త పోస్టర్స్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఐ'. విక్రమ్‌ హీరోగా నటిస్తున్నారు. అమీజాక్సన్‌ హీరోయిన్. ఈ సినిమాకు ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలను సమకూర్చారు. ఇటీవల తమిళ ఆడియో విడుదలైంది. సంక్రాతికి విడుదల ప్లాన్ చేసిన ఈ చిత్రం రిలీజ్ కాకముందే పోస్టర్స్ రూపంలోనూ క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ‘ఐ' విడుదల చేసేందుకు నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

    https://www.facebook.com/TeluguFilmibeat

    ఐ చిత్రం విడుదలకు ముందుగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. రూ. 100 కోట్ల బడ్జట్‌తో రూపొందుతున్న ఐ సినిమా కొత్త పోస్టర్‌లు ఇటీవల వెలువడ్డాయి. ఇందులో ఒక డిఫరెంట్‌ గెటప్‌తో కనిపిస్తున్న విక్రమ్‌ పోస్టర్‌ జనాన్ని విపరీతంగా ఆకట్టుకొంటోంది. ఎన్నో అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా లుక్‌ పై కూడా అంతే ఆసక్తి నెలకొంది.

    శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు.

    సినిమాలో హీరో విక్రమ్‌ ధరిస్తున్న వివిధ పాత్రలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూ, మార్కెట్లో అంచనాలను సృష్టిస్తున్నాయి. కొత్త ప్రయోగాలను అలరించే విధంగా తీర్చిదిద్దడంలో పేరు పొందిన శంకర్‌ సృజన ఈ సినిమాలో ఎలా ఉండబోతోందో అని సగటు అభిమాని ఎదురుచూస్తున్నాడు.
    కొత్త పోస్టర్లు స్లైడ్ షోలో...

    విక్రమ్‌ మాట్లాడుతూ....

    విక్రమ్‌ మాట్లాడుతూ....

    ‘‘ప్రేక్షకులకి ‘ఐ' నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కి గురవుతారు.'' అని తెలిపారు.

    అప్పుడు...ఇప్పుడు

    అప్పుడు...ఇప్పుడు

    ‘సేతు' నా కెరీర్‌లో గొప్ప చిత్రమవుతుందని ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఊహించాను. అలాగే ఇప్పుడు ‘ఐ' కూడా నా కెరీర్‌ను టర్నింగ్‌ చేసే సినిమా అవుతుంది అని కచ్చితంగా చెప్పగలను అంటున్నారు విక్రమ్.

    శంకర్ మాట్లాడుతూ..

    శంకర్ మాట్లాడుతూ..

    ‘‘నా సినిమాకు ‘అళగన్‌' అనిగానీ, ‘ఆనళగన్‌' అనిగానీ (రెండింటికీ అందగాడు అని అర్థం) టైటిల్‌ పెడదామనుకున్నాను. కానీ అవి రెండూ ఇంతకు ముందే సినిమా పేర్లుగా వచ్చేశాయి. అప్పుడే ‘ఐ' అనే టైటిల్‌ తట్టింది'' అని చెప్పుకొచ్చాడు శంకర్‌. ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఐ'. విక్రమ్‌, అమీజాక్సన్‌ జంటగా నటించారు.

    కీలక పాత్రల్లో..

    కీలక పాత్రల్లో..

    సురేష్‌గోపి, సంతానం కీలక పాత్రధారులు. షూటింగ్‌ పూర్తయింది. చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

    కెమెరా,సంగీతం

    కెమెరా,సంగీతం

    పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. జనవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

    శంకర్‌ మాట్లాడుతూ...

    శంకర్‌ మాట్లాడుతూ...

    ‘‘నా సినిమాలకు ఒకే అక్షరంతో పేరు పెట్టాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంటుంది. ఒక్క అక్షరంతో టైటిల్‌ ఉంటే ఎక్కువమందికి బాగా రీచ్‌ అవుతుంది. '' అని వివరించారు శంకర్‌.

    సౌందర్యానికి ...

    సౌందర్యానికి ...

    విక్రమ్‌, అమీజాక్సన్‌ నటించే కథ సౌందర్యానికి సంబంఽధించినది. అందుకే సౌందర్యం, అందగాడు అనే పదాలకు తమిళ డిక్షనరీల్లో అర్థాలను వెతికాను.

    అదే అర్దంతో...

    అదే అర్దంతో...

    అప్పుడు ‘ఐ' అంటే సౌందర్యం అనే అర్థాన్ని గమనించాను. ‘ఐ' అనే అక్షరం నాకు అమితంగా నచ్చింది. నా సినిమాకు ఈ టైటిల్‌ చక్కగా సరిపోతుందనుకుని అదే టైటిల్‌ని పెట్టాను. ‘ఐ' లోగో డిజైన్‌ కూడా అద్భుతంగా కుదిరినందుకు ఆనందంగా ఉంది.

     ‘ఐ'తో భారతీయ సినిమా చరిత్రలోకి ప్రవేశిస్తా

    ‘ఐ'తో భారతీయ సినిమా చరిత్రలోకి ప్రవేశిస్తా

    ‘ఐ' సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ పి.సి.శ్రీరామ్‌ పొంగిపోతున్నారు. భారతీయ సినీ యవనికపై అద్భుతమైన దృశ్యకావ్యంగా మిగులుతుంది అని పొగుడుతున్నారు. శంకర్‌ దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పి.సి.శ్రీరామ్‌ చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

    అందమైన అనుభవం..

    అందమైన అనుభవం..

    పి.సి.శ్రీరామ్‌ ఫేస్‌బుక్‌లో ‘ఐ' సినిమా గురించి రాసుకున్నారు. ‘‘ ఇటీవలే ‘ఐ' ఆఖరి షెడ్యూల్‌ పూర్తయింది. ‘ఐ' చిత్రం అందమైన అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాతో తప్పకుండా నేను భారతీయ సినిమా చరిత్రలోకి ప్రవేశిస్తాను.'' అని ఫేస్‌బుక్‌లో రాసుకున్నారు.

    అందరికీ ధన్యవాదాలు..

    అందరికీ ధన్యవాదాలు..

    దర్శకుడు శంకర్‌, విక్రమ్‌, బాస్కో, ముదిరాజ్‌, అమీ జాక్సన్‌, నా అసోసియేట్‌ వివేక్‌తో పాటు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటున్నారు పి.సి.శ్రీరామ్.

    ‘ఐ' చిత్రం సృజనకారుడు

    ‘ఐ' చిత్రం సృజనకారుడు

    ‘ఐ' సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. తప్పకుండా భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంటుంది. సినిమాను ఇంత గొప్పగా ఆవిష్కరించడానికి ఏకైక కారకుడు శంకర్‌. తనే ‘ఐ' చిత్రం సృజనకారుడు అన్నారాయన.

    సంక్రాతి రేసులో..

    సంక్రాతి రేసులో..

    సంక్రాంతి బరిలో ఉన్న‘ గోపాల గోపాల ' సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. జనవరి 9న రిలీజ్‌ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. సంక్రాంతి రేసులో శంకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘‘ ఐ '' వస్తోందని సమాచారం.

    మూడు భాషల్లోనూ..

    మూడు భాషల్లోనూ..

    ఇదోక అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుగా రూపొందిన చిత్రం. ఏక కాలంలో ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, భాషల్లో రిలీజవుతోంది.

    సూపర్ గుడ్ వారు...

    సూపర్ గుడ్ వారు...



    ఈ చిత్రాన్ని అస్కార్‌ ఫిల్మ్‌ పతాకంపై వి.రవిచంద్రన్‌ నిర్మించారు. తెలుగులోమెగా సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ వారు రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆడియో విడుదలై మంచి టాక్‌తెచ్చుకుంది.

    రెడ్ లెటర్ రాస్తుంది..

    రెడ్ లెటర్ రాస్తుంది..

    పి.సి.శ్రీరామ్‌ స్వయంగా ‘ఐ' సినిమా జనవరి 9న విడుదల అవుతుందని ట్వీట్‌ చేశారు. సినీ పరిశ్రమకు ఈ సినిమా ఓ రెడ్‌ లెటర్‌ రాస్తుందని పి.సి.శ్రీరామ్‌ ట్వీట్టర్‌లో తెలిపారు.

    ట్రైలర్ రికార్డ్

    ట్రైలర్ రికార్డ్

    ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను ఈ మధ్య విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. యుట్యూబ్‌లో ఇప్పటి వరకూ 9 మిలియన్‌ హిట్స్‌తో ‘ ఐ' ట్రైలర్‌.. రికార్డు స్పష్టించింది. ట్రైలర్లలో ఇంత భారీగా హిట్స్‌ వచ్చిన చిత్రం ‘ ఐ ' ఒక్కటే.

    ఇంకో కొత్త ట్రైలర్..

    ఇంకో కొత్త ట్రైలర్..

    జనవరిలో మరో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ....

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ....

    ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.

    విక్రమ్‌ మాట్లాడుతూ....

    విక్రమ్‌ మాట్లాడుతూ....

    ''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.

    కథేమిటంటే...

    కథేమిటంటే...

    ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్‌ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఐ'.

    English summary
    A new poster of 'I' romantic thriller reveals the costumes and accessories used to achieve this visual wonder. Amy Jackson who was dressed up in a black suit covered her upper part with an Royal Enfield armour and wears a metallic cap.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X