»   » ఫెంటాస్టిక్:మంచు విష్ణు 'డైనమేట్' మోషన్ పోస్టర్

ఫెంటాస్టిక్:మంచు విష్ణు 'డైనమేట్' మోషన్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్ :మంచు విష్ణు హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ చిత్రం అరిమనంబి ఆధారం. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రానికి డైనమేట్ అన్న పేరుని ఖరారు చేసి, ఇప్పుడు మోషన్ పోస్టర్ ని వదిలారు. ఎప్పటిలాగే దేవకట్టా తన మార్క్ డైలాగుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుమంచు విష్ణు హీరోగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2014లో పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు చిత్రాల్లో నటించిన ఈ డైనమిక్ హీరో ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ లుక్, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు.ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అరిమ నంబి' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది.


ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ కి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో విష్ణు డిఫరెంట్ గా చెవిపోగులతో కనిపించనున్నాడు. హీరో కొత్త లుక్ లో కనబడితే బావుంటుందని భావించిన డైరెక్టర్ దేవాకట్టా తన ఆలోచనని విష్ణుకి తెలియజేయడం, సినిమాల్లో తన పాత్ర, లుక్ పరంగా భిన్నంగా కనబడాలనుకునే హీరో మంచు విష్ణు దానికి సరేననడం జరిగింది.


Motion Poster: Manchu Vishnu's Dynamite is here

మంచు విష్ణు మాట్లాడుతూ.... డైనమేట్ లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ డిమాండ్ మేరకు కొత్త లుక్ కోసం పాత్ర పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో నా పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కొత్తగా వుంటాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాంఅన్నారు.


విష్ణు పోషిస్తున్న పాత్ర, ఆయన అభినయం, ఆహార్యానికి తగినట్లుగానే ‘డైనమైట్‌' టైటిల్‌ను నిర్ణయించినట్లు దేవా కట్టా చెప్పారు. ‘‘చెవిపోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్‌ లుక్‌తో విష్ణు కనువిందు చేయనున్నారు. ఇందులో యాక్షన్‌ సన్నివేశాల కోసం ఆయన స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. ప్రేక్షకులు, అభిమానులను అలరించే విధంగా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నాం'' అని ఆయన తెలిపారు.


విష్ణు మాట్లాడుతూ ‘‘సినిమా ప్రస్తుతం ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. టైటిల్‌కు తగ్గట్లుగా సినిమా ఉంటుంది. ఈ వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

English summary
Manchu Vishnu’s will be seen as “Dynamite” in the upcoming film that is getting directed by Deva Katta. This film happens to remake of Tamil hit “Arima Nambi”. Currently the first ever motion poster of the flick is released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu